Viral Video: గుడ్లను దొంగిలిస్తున్న మహిళలు.. పాఠం నేర్పిన నెమలి

Viral Video: ఓ నెమలి గుడ్లు పెట్టి గూడు వదిలి ఆహారం కోసం బయటకు వెళ్లింది. సురక్షితంగానే ఉంటాయనుకుంది. కానీ ఈలోపు గుడ్లపై మహిళల కన్నుపడింది. గుటకాయ స్వాహా చేద్దామనుకున్నారు ఇద్దరు మహిళలు. ఓ మహిళ నెమలి గుడ్లను దొంగిలించడానికి చెట్టుపైకి ఎక్కింది. మరొక మహిళ కింద ఉండి ఆ గుడ్లను జాగ్రత్తగా పట్టుకుంటోంది. కానీ ఇంతలోపు ఎవరో నీ గుడ్లు దొంగిలిస్తున్నారన్న విషయం తన చెవిన వేసినట్టే పరుగున వచ్చి చెట్టెక్కిన మహిళను కుళ్ల బొడిచింది నెమలి. అంతే వేగంతో కింద ఉండి గుడ్లు అందుకున్న మహిళపై కూడా విరుచుకుపడింది.
ది ఫిగెన్ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది దీనికి దాదాపు 1 లక్ష వీక్షణలు వచ్చాయి. మీరూ ఓ లుక్కేయండి.. అమ్మ ప్రేమ అందరి విషయంలో ఒక్కటే అని అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే అన్నీ తెలుసనుకుంటున్న మనుషులకంటే పక్షులు, జంతువులే బిడ్డల పట్ల ప్రేమగా ఉంటాయి. కన్నబిడ్డల్ని నిర్థాక్షణ్యంగా చంపేయడం, కనిపెంచిన తల్లిదండ్రులను ఆస్థికోసమో మరోదానికోసమో మట్టుపెట్టడం మనుషుల్లోనే చూస్తుంటాము. నోరు లేని జంతువుల్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
They deserved more! 💪
— The Figen (@TheFigen_) April 17, 2023
pic.twitter.com/Pc5rZqhGMa
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com