Woman Dance In Live Debate: లైవ్ డిబేట్‌లో తనను పట్టించుకోవట్లేదని మహిళ చేసిన పనికి అందరూ షాక్..

Woman Dance In Live Debate: టీవీ ఛానెళ్లలో డిబేట్స్ చూడడానికి ఇప్పటికీ చాలామంది ఇష్టపడతారు. ఒకప్పటి డిబేట్స్‌కు ఇప్పటి డిబేట్స్‌కు చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వారు వినిపించడానికి నిరంతరం ఉత్సాహంతో కనిపిస్తున్నారు. అందులో భాగంగానే చాలామంది ఒకేసారి మాట్లాడడం వల్ల ఇతరులకు మాట్లాడే అవకాశం రావట్లేదు. అలా రానందుకు ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
మామూలుగా డిబేట్స్‌లో గొంతు పెద్దగా ఉన్నవారికి మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది. లేని వారికి మాట్లాడడం కష్టమయిపోతుంది. అయితే ఎప్పటిలాగానే ఓ ప్రముఖ బెంగాలి న్యూస్ ఛానెల్‌లో ఓ డిబేట్ జరుగుతోంది. అందులో ఓ మహిళ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా లైవ్ డిబేట్ అని కూడా మర్చిపోయి.. లేచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది.
డిబేట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఓ మహిళ లైవ్‌లోనే లేచి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విటర్‌లో ఈ వీడియో ట్రెండ్ అవ్వడంతో నెటిజన్లు దీనిపై తెగ కామెంట్లు చేస్తున్నారు. తాను లైవ్‌లో ఉన్నానని మర్చిపోయిందంటూ, ఇది డిబేట్ కాకుండా డ్యాన్స్ షో అనుకుంటుందేమో అంటూ.. నెటిజన్ల కామెంట్లు కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com