viral video: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. కదులుతున్న రైలు కింద మహిళ

viral video: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. కదులుతున్న రైలు కింద మహిళ
X
viral video: భూమ్మీద నూకలుండాయండి.. అందుకే ఆమె బతికింది.. ఆ సంఘటన చూసిన తోటి ప్రయాణీకులు ఆశ్చర్యంతో పలికిన మాటలు ఇవి.

viral video: భూమ్మీద నూకలుండాయండి.. అందుకే ఆమె బతికింది.. ఆ సంఘటన చూసిన తోటి ప్రయాణీకులు ఆశ్చర్యంతో పలికిన మాటలు ఇవి. అవును మరి చూసిన వాళ్లు ఎవరైనా ఇదే మాట అంటారు.సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ సంఘటన యొక్క వీడియో, గాయపడకుండా ఉండటానికి ప్రశాంతంగా ట్రాక్‌పై పడుకున్న మహిళపై రైలు ప్రయాణిస్తున్నట్లు చూపిస్తుంది.శుక్రవారం బీహార్‌లోని గయాలో రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా స్టేషన్‌లో ఉన్న రైలు అకస్మాత్తుగా కదలడంతో ఒక మహిళ గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

గయాలోని టంకుప్ప రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.ప్లాట్‌ఫారమ్‌కు అవతలి వైపు నుంచి మరో రైలు ఎక్కాల్సి ఉన్నందున ట్రాక్‌ను దాటేందుకు మహిళ కదులుతున్న రైలు ఎక్కిందని అధికారులు తెలిపారు.రైలు కదలడంతో ఆ మహిళ పట్టు కోల్పోయి కింద పడిపోయింది.

గాయపడకుండా ఉండటానికి రైలు ట్రాక్‌పై పడుకుంది. రైలు ఆమె మీదుగా వెళుతుంది. ట్రైన్ వెళ్లిపోయింది అని తెలిశాక లేచి కూర్చుంది. అనంతరం పోలీసులు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను పట్టాల మీద నుంచి బయటకు తీసుకు వచ్చారు. చిన్న చిన్న గాయాలతో బయటపడిన ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు రైల్వే అధికారులు. ఆమె సమయస్ఫూర్తిని పలువురు కొనియాడారు. ఆమె ధైర్యానికి మెచ్చుకున్నారు మరి కొందరు.

Tags

Next Story