మోటార్ బైక్ పై లేడీ ఫుడ్ డెలివరీ.. జొమాటో సీఈవో స్పందన
ఏదైనా న్యూస్ ని వైరల్ చేయాలంటే కాస్త భిన్నంగా చేయాలి. అందరూ చేసేదే మనమూ చేస్తే ఎవరు చూస్తారు.. కాస్త కళాపోషణ జోడిస్తే వ్యూస్ వస్తాయి. ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్.. ఏవరేమనుకుంటే నాకేంటని ఓ యంగ్ లేడీ మోటార్ బైక్ ఎక్కి జొమాటో బ్యాగ్ ని తగిలించుకుంది. షార్ట్ వేసుకుని రయ్ మంటూ ఇండోర్ రోడ్డుపై దూసుకువెళ్తోంది. సిగ్నల్ పడడంతో అందరి చూపు ఆమెపై మళ్లింది. ఇంకేముంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
హెల్మెట్ లేకుండా మోటారుసైకిల్ నడుపుతున్న మహిళ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోపై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ మంగళవారం స్పందిస్తూ కంపెనీకి, ఈ మహిళకు ఏమీ సంబంధం లేదని అన్నారు. ఒక వినియోగదారు 'X'లో వీడియోను పోస్ట్ చేస్తూ..“ఇండోర్ #Zomato మార్కెటింగ్ హెడ్‌కి ఈ ఆలోచన వచ్చినట్లు ఉంది. అతను ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ఖాళీ జొమాటో బ్యాగ్‌తో తిరిగేందుకు ఒక మోడల్‌ను నియమించుకున్నట్లున్నారు అని పోస్ట్ చేశాడు.
వినియోగదారు పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ, గోయల్ స్పందిస్తూ, “దీనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము హెల్మెట్ లేని బైకింగ్‌ను ఆమోదించము. అలాగే, మాకు ఇండోర్ మార్కెటింగ్ హెడ్ కూడా లేరు.” అని అతడికి రిప్లై ఇచ్చారు. "ఇది మా బ్రాండ్‌లో కేవలం 'ఫ్రీ-రైడింగ్' చేసిన వ్యక్తిలా కనిపిస్తోంది. మహిళలు ఫుడ్ డెలివరీ చేయడంలో తప్పు లేదు - జీవనోపాధి కోసం ప్రతిరోజూ వందలాది మంది మహిళలు డెలివరీ ఏజెంట్లుగా ఉన్నారు. వారి పని నీతి గురించి మేము గర్విస్తున్నాము, ”అని వివరించారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో 1.8 మిలియన్లకు పైగా వీక్షించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com