ప్రియుడిని నగ్నంగా రోడ్డుపై వదిలివెళ్లిన ప్రియురాలు..

ప్రియుడిని నగ్నంగా రోడ్డుపై వదిలివెళ్లిన ప్రియురాలు..
అయిదేళ్లు ప్రేమించిన వ్యక్తితో అమానుషంగా ప్రవర్తించిన ప్రియురాలు... డబ్బు, బంగారం దోచుకుని నగ్నంగా నడిరోడ్డుపై వదిలేసి పరారీ...

ప్రియుడి చేతిలో మోసపోయిన ప్రియురాలు... పెళ్లి చేసుకోవడం లేదని ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి... తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రేమికుడి ఇంటి ఎదుట ప్రేయసి ఆందోళన... మనం తరచుగా ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాం. కానీ తాజాగా ఓ యువతి చేసిన పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన ప్రేయసి చేసిన పనికి ఆ యువకుడు ఏం చేయాలో అర్థం కానీ స్థితిలో పడిపోయాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే.....


మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాహాపుర్‌ ప్రాంతానికి చెందిన బాలాజీ శివ్‌భగత్‌ అనే వ్యక్తి కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నాడు. అతడికి అదే పట్టణానికి చెందిన 30 ఏళ్ల భావికా బోయిర్ అనే మహిళతో అయిదేళ్లుగా ప్రేమాయణం నడుస్తోంది. ప్రేమ పేరుతో కొన్నేళ్లుగా ఆ మహిళ బాలాజీ నుంచి ఖరీదైన గిఫ్ట్‌లు, డబ్బులు తీసుకుంది. మరో వ్యక్తి దొరకడంతో అతడ్ని నడిరోడ్డుపై నగ్నంగా వదిలేసి పోయింది. గత జూన్‌ 28న బాలాజీకి ఫోను చేసిన ప్రేయసి... నీతో మాట్లాడాలి సాయంత్రం 4.30కు ఒంటరిగా అట్‌గావ్‌ హైవే వద్దకు రమ్మని పిలిచింది. ప్రియురాలు పిలిచిందనే ఆనందంలో ఆమెకు ప్రత్యేక గిఫ్ట్‌లు తీసుకొని బాలాజీ ఆమె చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. కారులో కూర్చొని ఇద్దరు ముచ్చట్లలో మునిగిపోయారు. ఇంతలో భావికాతో వచ్చిన నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా బాలాజీపై దాడి చేశారు. ఆ తర్వాత అతడి కళ్లలో కారం కొట్టి కారుతో సహా పారిపోయారు. అతడు తీసుకువచ్చిన గిఫ్ట్‌లతో పాటు బాలాజీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని.. చివరికి బట్టలు కూడా లాగేసుకుని నగ్నంగా నడిరోడ్డుపై తనను వదిలేసి బాలాజీ ప్రియురాలు వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.


తనపై ఎలా దాడి జరిగిందో బాలాజీ పోలీసుకు పూస గుచ్చినట్లు వివరించాడు. తన ప్రియురాలు తనకు కొన్ని గిఫ్ట్‌లు తీసుకొని రమ్మని చెప్పిందని ఆమె చెప్పినట్లే ఒక చీర, బంగారు చెవి పోగులు, బంగారు కాళ్ల పట్టీలు, కొత్త షూలు, ఒక గొడుగు తీసుకుని.. ఆమె చెప్పిన స్థలానికి.. కారులో వెళ్లానని తెలిపాడు. తాము కారులో కూర్చొని మాట్లాడుకుంటుండగా భావిక వెంట వచ్చిన నలుగురు వ్యక్తులు తనను కొట్టి కారులో పడేశారని తెలిపాడు. అందులో నదీమ్ ఖాన్ అనే ఒక వ్యక్తి మాత్రమే తనకు తెలుసని.. మిగితా వారు తెలియదని బాలాజీ పోలీసులకు వెల్లడించాడు. అనంతరం తన తలపై పదునైన ఆయుధంతో బలంగా కొట్టారని పేర్కొన్నాడు. తర్వాత అందులో ఒక వ్యక్తి కారును తీసుకెళ్లి జాతీయ రహదారిపై ఉన్న ఓ పాత దాబా వద్ద ఆపి తనను అందులోకి తీసుకెళ్లినట్లు చెప్పాడు. అక్కడ తనను చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ప్రియురాలు మిగిలిన వ్యక్తులు తన బట్టలు విప్పించారని... దానిని వీడియో తీశారని తర్వాత తనను రోడ్డుపై నగ్నంగా వదిలేసి వెళ్లిపోయారని బోరుమన్నాడు. బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. భావిక సహా మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story