Viral News: ఎమ్‌ఏ ఇంగ్లీష్‌ చదివి చేస్తున్న ఉద్యోగాన్నీ వదిలేసి.. గల్లీలో చాట్ బండి

Viral News: ఎమ్‌ఏ ఇంగ్లీష్‌ చదివి చేస్తున్న ఉద్యోగాన్నీ వదిలేసి.. గల్లీలో చాట్ బండి
Viral News: ఇదేం పిచ్చిం.. అంత బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ నెల తిరిగే సరికి లక్షకు పైగా జీతం సంపాదిస్తూ ఈ చాయ్ అమ్ముకోవడం ఏంటి. ఎవరైనా ఇలానే కదా అనుకుంటారు..

Viral News: ఇదేం పిచ్చిం.. అంత బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ నెల తిరిగే సరికి లక్షకు పైగా జీతం సంపాదిస్తూ ఈ చాయ్ అమ్ముకోవడం ఏంటి. ఎవరైనా ఇలానే కదా అనుకుంటారు.. కానీ ఇష్టంలేని పని చేయడం ఎంత కష్టమో చేస్తున్న వారికి మాత్రమే తెలుస్తుంది.. "మనకు ధైర్యం ఉంటే మన కలలన్నీ నిజమవుతాయి" అని వాల్ట్ డిస్నీ ఏనాడో సెలవిచ్చారు. నిజంగానే ధైర్యం కావాలి కొన్ని పనులు చేయాలంటే.. ఓ పని చేస్తూ కొత్త దారిలో వెళతామంటే వద్దని వెనక్కి లాగే ఉంటారు.. కొందరు మాత్రమే భుజం తట్టి ధైర్యం చెబుతారు..

గత ఐదేళ్లలో భారతదేశంలో స్టార్టప్‌లు ఊపందుకున్నాయి. చాలా మంది తమ ఉద్యోగాలను వదులుకుని పారిశ్రామికవేత్తలుగా మారారు. ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్న శర్మిష్ట ఘోష్ యువ స్పూర్తిదాయక పారిశ్రామికవేత్తలలో ఒకరు. శర్మిష్ట బ్రిటీష్ కౌన్సిల్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఢిల్లీ కాంట్‌లోని గోపీనాథ్ బజార్‌లో టీ స్టాల్‌ను ప్రారంభించింది.


శర్మిష్ట కథను రిటైర్డ్ బ్రిగేడియర్ ఇండియన్ ఆర్మీ సంజయ్ ఖన్నా లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. పోస్ట్ ప్రకారం, శర్మిష్ట తన చిన్న టీస్టాల్‌ని చైయోస్ లాగా పెద్దదిగా చేయాలని కలలు కంటోంది. "నాకు ఆసక్తిగా అనిపించి ఆమెను అడిగాను. చాలా బ్రాంచ్‌లతో ఉన్న ప్రసిద్ధ టీ సెటప్ అయిన చాయోస్‌ మాదిరిగా తన స్టాల్‌ని కూడా పెద్దదిగా చేయాలనేది తన కల అని ఆమె పేర్కొంది. "అని శర్మిష్ట ఫోటోతో పాటు ఖన్నా పోస్ట్ చేశారు.

ఆమె స్నేహితురాలు, లుఫ్తాన్సాతో పనిచేస్తున్న భావనా​రావు కూడా ఈ చిన్న చాయ్ స్టాల్ నిర్వహణలో జాయింట్ పార్టనర్‌గా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ కలను సాకారం చేసుకోవడానికి కృషి చేయాలి. ఉన్నత విద్యార్హతలు, ఉన్నత ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ ఉండకూడదని నేను గట్టిగా భావిస్తున్నాను, అయితే దీర్ఘకాలంలో అభివృద్ధి చెందడానికి చిన్న మార్గాల గురించి ఆలోచించాలి"అని ఖన్నా అన్నారు.



శర్మిష్ట ఘోష్ మరియు భావరావు కథ నిజంగా స్ఫూర్తిదాయకం. కృషి, దృఢ సంకల్పంతో ఏదైనా సాధ్యమవుతుంది. "నాకు అర్థం కాలేదు.. ఇంగ్లీషులో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిఉండి చాయ్ దుకాణం ఎందుకు తెరిచింది. ఆమె తన విద్యను బోధనలో ఉపయోగించుకోవచ్చు.. పోనీ ఫుడ్ చైన్ తెరవడం ఆమె కల అయితే పీజీ పూర్తయ్యే వరకు ఎందుకు వేచి ఉండాలి అని మరొక ఒక వినియోగదారు ఖాన్ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు.


మరొక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించాడు, "ఆర్థికంగా వారిపై ఆధారపడని కుటుంబం ఉంటే అలాంటి చర్యను సులభంగా తీసుకోవచ్చు. కానీ ఆర్థిక బాధలు ఉంటే ఇలాంటి సాహసం ఎవరూ చేయరు.. మంచి ఉద్యోగాన్ని వదులుకోరు. ఎవరైనా సానుభూతి చూపిస్తారే కానీ డబ్బు సాయం చేయరు.

Tags

Next Story