Apple-Amazon: ఆపిల్ వాచ్ ఆర్డర్ పెడితే, ఆమెకి వచ్చింది ఇదే..

Apple-Amazon: ఆపిల్ వాచ్ ఆర్డర్ పెడితే, ఆమెకి వచ్చింది ఇదే..
** అమెజాన్‌లో (Amazon) యాపిల్ వాచ్‌కి బదులు ఫేక్ వాచ్ పొందిన మహిళ

అమెజాన్‌లో(Amazon) యాపిల్ వాచ్(Apple Watch) ఆర్డర్ చేసిన ఒక మహిళకి, ఫేక్ వాచ్ వచ్చిన ఘటన ఎదురైంది. కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసినా లాభం లేకపోయిందని ఆ మహిళ వాపోయింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలయింది.యాపిల్ సిరీస్-8 వాచ్ మనదేశంలో రూ.46,000 నుంచి రూ.80,000 ధరల్లో లభిస్తోంది.

"అమెజాన్‌ సైట్‌ నుంచి ఎప్పుడూ కొనుగోలు చేయవద్దు. జులై 8న నేను యాపిల్ సిరీస్-8 వాచ్‌ను (Apple Series 8 Watch) ఆర్డర్ చేశాను. కానీ 9వ తేదీన నాకు ఫేక్ 'ఫిట్‌లైఫ్' వాచ్ పంపారు. చాలా సార్లు కస్టమర్ కేర్‌ని సంప్రదించినప్పటికీ వారి నుంచి నాకు ఎలాంటి సాయం అందలేదు. సాధ్యమైనంత త్వరగా నా సమస్యకు పరిష్కారం చూపాలి" అంటూ యాపిల్ కంపెనీని ట్యాగ్ చేస్తూ, ఆర్డర్ డిటేల్స్‌తో కూడిన ఫోటోలను షేర్ చేసింది.

దీనికి స్పందించిన అమెజాన్ (Amazon)"మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. మీ సమస్యను మాకు మెజేజ్ రూపంలో తెలియజేయండి. మా వంతు ప్రయత్నం మేం చేస్తాం. మీ వ్యక్తిగత వివరాలతో కూడిన ఆర్డర్ వివరాలను పంచుకోవద్దు" అని రిప్లై ఇచ్చింది.

క్షణాల్లోనే 2 లక్షలకు పైగా వ్యూస్‌తో ఈ పోస్ట్ వైరల్ కావడంతో ట్విట్టర్ వినియోగదారులు తమకు ఎదురైన అనుభవాల్ని పంచుకున్నారు.


"నేను ఈ ఆన్‌లైన్ పోర్టళ్లలో నేను ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయను. ఆఫ్‌లైన్ స్టోర్లలో చూసి, తాకి, కొన్న వస్తువుల్లో ఉండే అనుభూతే వేరు" అని ఒక యూజర్ అన్నాడు.

"నేను రిటర్న్ పెట్టిన ఒక షర్ట్‌ని అమెజాన్‌ని ప్రతినిధి దానిని క్యాన్సల్ చేశాడు. రిటర్న్‌కి చెప్పిన కారణం సరిగా లేదని తిరస్కరించాడు. అమెజాన్‌కి నేను కాల్‌ రికార్డింగ్స్ పంపినప్పటికీ నా సమస్యకి పరిష్కారం దొరకలేదు" అని మరో యూజర్ అనుభవాన్ని వెల్లడించాడు.


Tags

Next Story