Reality show.. ఈ బుల్లితెరపై రియాల్టీషోల‌కు నోరెళ్లబెట్టే ప్రైజ్ మనీ!

Reality show.. ఈ బుల్లితెరపై రియాల్టీషోల‌కు నోరెళ్లబెట్టే ప్రైజ్ మనీ!

Reality show

Reality show..ఇలాంటి రియాల్టీషోలో విన్ అయిన కంటెస్టెంట్ దశ తిరిగిపోతుంది. పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఇంటికి పట్టుకెళ్లవచ్చు.

Reality show.. బుల్లితెరపై రియాల్టీషో‌కు లభించే ఆదరణ మరే ఇతర షోలకు లభించదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో బిగ్‌బాస్ షోకు టీఆర్‌పీ పరంగా ఢోకా లేదని నాలుగు సీజన్‌లు నిరూపించాయి. ఇలాంటి షోలు ఏ భాషలో చేసినా అదిరిపోయే టీఆర్‌పీ రేటింగ్ వస్తుంది. ఇక ఇలాంటి రియాల్టీషోలో విన్ అయిన కంటెస్టెంట్ దశ తిరిగిపోతుంది. పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఇంటికి పట్టుకెళ్లవచ్చు. కానీ ఇదంత నిజమేనా..!

Telugu Bigg Boss :

* తెలుగు బిగ్ బాస్ సీజన్ ట్రోఫీ గెలిస్తే విన్నర్‌కి వచ్చే ప్రైజ్ మనీ రూ.50 లక్షలు.. ఈ యాభై లక్షలతో పాటు వారికి అదనంగా కూడ కొంత నగదు వస్తుంది. సీజన్ 1 విన్నర్ శివ బాలాజీ.. సీజన్2 విన్నర్ కౌశల్‌.. సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. తలో యాభై లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు.


సీజన్ 4 విషయానికి వస్తే .. సేమ్ ఫస్ట్ సీజన్‌కి ఎంతైతే అమౌంట్ ఇచ్చారో నాలుగు సీజన్లుగా అదే ప్రైజ్ మనీ.. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 4 విజేత అయిన అభిజిత్‌ మాత్రం రూ. 25 లక్షల ఫ్రైజ్ మనీ అందుకున్నారు. రూ.25 లక్షల ప్రైజ్ మనీ ఎందుకంటే.. మరో కంటెస్టెంట్ సొహైల్ పోటీ నుంచి తప్పుకోవడానికి రూ.25 లక్షలు తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని ప్రైజ్ మనీ నుంచి కట్ చేశారు.

అయితే రూ. 50 లక్షల ప్రైజ్ మనీలో దాదాపు రూ.14 లక్షలకు పైగా టాక్స్ రూపంలో కట్ అవుతోంది. అంటే విజేతకు రూ.35-40 లక్షలు వస్తుంటాయి. అయితే విన్నర్ అయిన కంటెస్టెంట్స్ ప్రైజ్ మనీ ప్లస్ రెమ్యునరేషన్ కలుపుకుంటే సుమారు కోటి రూపాయల వరకూ తీసుకుని వెళ్లే అవకాశం ఉంటుంది.


* వామ్మో.. కోటి రూపాయలా అని ఆశ్చర్యపోకండి. దీన్ని మించి ప్రైజ్‌మనీ ఇచ్చే షోలు కూడా ఉన్నాయి.. వాటి గురించి తెలిస్తే.. ఒక్క షో చేస్తే అంత డబ్బు వస్తుందా అని నోరెళ్లబెడతారు.

Hindi Bigg Boss :

* హిందీ బిగ్‌బాస్.. ఈ రియాలిటీ షో కి వచ్చే ఆదరణ మాములుగా ఉండదు. ఇటీవల ఈ షో విన్నర్ అయిన రుబీనా దిలాయిక్ రూ. కోటిన్నర పైనే మూటగట్టుకుంది. విజేతగా నిలిచినందుకు రూ.36 లక్షల ప్రైజ్‌మనీ.. హౌస్‌లో ఉన్నందుకు వారానికి రూ.5 లక్షలు.. ఇతర నజరానాలు అన్నీ కలిపి ఈ ముద్దుగుమ్మ రూ.కోటిన్నర వరకు తన బ్యాగ్‌లో వేసుకుంది.


Big Brother :

* బిగ్ బ్రదర్.. మన తెలుగు బిగ్‌బాస్ షోకి మూలం ఈ షోనే. ఫస్ట్ టైం డచ్ టీవీలో స్టార్ట్ అయింది. ఇండియాలో అనేక భాషల్లో ఈ షో దూసుకెళ్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇందులో కనిపించిన తర్వాతే ఈ షో బాగా పాపులరైంది. 'బిగ్ బ్రదర్' షోలో కంటెస్టెంట్‌లను ఒక హౌస్‌లో ఉంచి.. రకరకాల టాస్కులు పెడతారు. ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా హౌస్ నుంచి కొందరు బయటికి వస్తారు. ఫైనల్‌గా ఒకరు విన్ అవుతారు. విన్నర్‌కి రూ.3 కోట్ల 75 లక్షలు ప్రైజ్‌మనీ అందజేస్తారు. 2000వ సంవత్సరం నుంచి 'బిగ్ బ్రదర్' షో ని రన్ చేస్తున్నారు.



Survivor :

* సర్వైవర్.. పోటాపోటీగా ఉండే రియాలిటీ షో ఇది. ఈ షోని ఫ్రాన్స్‌కి చెందిన ' బనిజయ్ గ్రూప్' నిర్వహిస్తోంది. Dare and Dash ఉన్నవాళ్లు మాత్రమే ఈ షోకి రావాలనేది ఫస్ట్ కండిషన్. ఈ షోలో కంటెస్టెంట్‌ని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తారు. వారిని టీమ్‌లుగా చేసి.. ఒళ్లు గగుర్పొడిచే Games పెడతారు. సుమారు ఐదునెలల పాటు ఆ నిర్మానుష్య ప్రాంతంలో వారు గడపాల్సి ఉంటుంది. 1, 2, 3 స్థానాల్లో నిలిచిన వారికి ప్రైజ్‌మనీ పంచుతారు. 2000వ సంవత్సరం నుంచి 'సర్వైవర్' షో ని రన్ చేస్తున్నారు. ఈ షో ప్రైజ్‌మనీ రూ.7కోట్ల 25 లక్షలు.


The Amazing Race :

* ది అమేజింగ్ రేస్.. ఇది ఒక అడ్వెంచర్ రియాలిటీ షో.. సుమారు 50 కంటే ఎక్కువ దేశాల్లో ఈ రియాలిటీ షోలు జరుగుతున్నాయి. ఈ షో ప్రపంచమంతా చుట్టేసే అడ్వెంచర్ ట్రిప్ (Adventure trip ) లాంటింది. ఈ షోలో రేస్‌లు కూడా పెడుతుంటారు. రహదారులు సరిగ్గా లేని రోడ్ల నుంచి కంటెస్టెంట్స్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ షో ప్రైజ్‌మనీ రూ.7కోట్ల 25 లక్షలు. 2001వ సంవత్సరం నుంచి ' ది అమేజింగ్ రేస్' షో ని రన్ చేస్తున్నారు.


America's Got Talent :

* అమెరికాస్ గాట్ టాలెంట్.. మనలో దాగి ఉన్న టాలెంట్‌ని నిరూపించుకోవడానికి ఇది చక్కటి వేదిక. ఈ షోలో డాన్స్, సింగింగ్, కామెడీ, మ్యాజిక్ వంటివి ప్రదర్శించవచ్చు. ఈ షో ఇప్పటికే 15 సీజన్‌లు కంప్లీట్ చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో షోలు ప్రసారం అవుతున్నాయి. ఈ షో ప్రైజ్‌మనీ రూ.7కోట్ల 25 లక్షలు. ప్రైజ్‌మనీతో పాటు లాస్‌వెగాస్‌లోని ప్లానెట్‌ హాలీవుడ్‌లో పదివారాల పాటు ఆతిథ్యం పొందవచ్చు. 2006వ సంవత్సరం నుంచి 'అమెరికాస్ గాట్ టాలెంట్' షో ని రన్ చేస్తున్నారు.


The Voice :

* ది వాయిస్.. సింగింగ్ రియాలిటీ షో. ఇండియాలో నిర్వహిస్తున్న అన్ని సింగింగ్ రియాలిటీ షోలకు ఇది స్ఫూర్తి. అమెరికాలో ఈ షో 18 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఈ షోలో పార్టిసిపెంట్ చేసి.. చాలా మంది పాప్‌ సింగర్లుగా మారారు. జేవియర్‌ కోలన్‌, జోర్డాన్‌ స్మిత్‌, కోల్‌ కొహాన్‌స్కీ లాంటి వారు ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చి.. పాప్ సింగర్లుగా ఎదిగారు. ఈ షో ప్రైజ్‌మనీ రూ.75లక్షలు. 2011వ సంవత్సరం నుంచి 'ది వాయిస్' షో ని రన్ చేస్తున్నారు.



Dancing With The Stars :

* డాన్సింగ్ విత్ ది స్టార్స్.. బ్రిటన్‌కి చెందిన 'స్ట్రిక్ట్‌లీ కమ్‌ డాన్సింగ్‌'కి ఈ షో ప్రేరణ. మన ఇండియాలో నిర్వహిస్తున్న అన్ని డాన్స్ షోలకు ఇది స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఈ షోలో పార్టిసిపెంట్స్‌తో ఒక ప్రముఖ సెలెబ్రెటీ జోడీ కడతారు. ఈ షోని దాదాపు పదిహేను వారాలపాటు నిర్వహిస్తారు. ఫైనల్‌గా విన్నర్‌ని, రన్నరప్‌ని ఎంపిక చేస్తారు. టైరా బ్యాంక్స్‌, బ్రూక్‌ లిసా, సమంతా హ్యారిస్‌లాంటి టాప్‌ యాంకర్లు ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ షో ప్రైజ్‌మనీ రూ.37లక్షలు. ప్రైజ్‌మనీతో పాటు మిర్రర్‌ బాల్‌ గోల్డ్‌ ట్రోఫీని అందజేస్తారు. 2005వ సంవత్సరం నుంచి 'డాన్సింగ్ విత్ ది స్టార్స్' షో ని రన్ చేస్తున్నారు.



Top Chef :

*టాప్ చెఫ్.. వంట ఎవరు టేస్టీగా వండుతారో తేల్చే రియాలిటీ షో. ఈ షో జడ్జ్‌లు అంతా ప్రముఖ పుడ్ కోర్ట్‌లు, రెస్టారెంట్లలో బెస్ట్ చెఫ్‌లు. ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్‌ అవుతారు. ఫైనల్‌గా ఒకరు విన్నర్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఇప్పటికి ఈ షో 12 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. విన్నర్‌కి రూ.90లక్షలు ప్రైజ్‌మనీతో పాటు.. 'టాప్‌ చెఫ్‌ ఆల్‌ స్టార్స్‌' అనే బిరుదు కూడా ఇస్తారు. 2006వ సంవత్సరం నుంచి 'టాప్ చెఫ్' షో ని రన్ చేస్తున్నారు.




Tags

Next Story