Noida: అర్ధరాత్రి రోడ్డు మీద యువకుడి పరుగు.. కారణం తెలిసి కారులో ఉన్న డైరెక్టర్ షాక్

Noida: అర్ధరాత్రి రోడ్డు మీద యువకుడి పరుగు.. కారణం తెలిసి కారులో ఉన్న డైరెక్టర్ షాక్
Noida: ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్ మెహ్రా తన సోదరుడితో కలసి నివసిస్తున్నాడు. అతని తల్లి ఆసుపత్రిలో ఉంది.

Noida: అర్ధరాత్రి రోడ్డు మీద పరుగు తీస్తున్న ఆ యువకుడిని చూసి కారులో ఉన్న దర్శకుడికి కాలు నిలవ లేదు.. వెంటనే కారు ఆపి ఎక్కడికి వెళుతున్నావు.. డ్రాప్ చేయనా అని అడిగారు.. వద్దు సార్ అన్నాడు.. మళ్లీ అడిగాడు.. అయినా ఆ యువకుడి నోటి నుంచి అదే మాట.. ఇంతకీ ఎందుకు ఆ యువకుడు అలా పరుగుతీస్తున్నాడో తెలుసుకుని షాక్ అయ్యాడు దర్శకుడు. నిజంగా నువ్ బంగారం అని ప్రేమగా ఆ యువకుడిని సంబోధించి వివరాలు కనుక్కున్నాడు దర్శకుడు, రచయిత, నిర్మాత అయిన వినోద్ కాప్రీ.

ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్ మెహ్రా తన సోదరుడితో కలసి నివసిస్తున్నాడు. అతని తల్లి ఆసుపత్రిలో ఉంది. అర్ధరాత్రి నోయిడా రహదారిపై పరుగెత్తుతున్న ఆ యువకుడికి గురించిన సమాచారం సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కాప్రీ. ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వేల మంది వీక్షకుల మనసులను దోచుకుంది ఆ వీడియో..

యువకుడు లిఫ్ట్‌ని తిరస్కరించడానికి గల కారణాలను వీడియోలో వివరించాడు.మెక్ డొనాల్డ్ లో పని చేస్తున్నానని తెలిపాడు ప్రదీప్. రాత్రిపూట 10 కిలోమీటర్లు పరుగెత్తాలని సంకల్పం పెట్టుకున్నాడట. ఎందుకు అని అంటే తాను ఆర్మీలో పని చేయాలనుకుంటున్నానని అందుకోసం పని ప్రదేశం నుంచి ఇంటికి వెళ్లే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని అన్నాడు.. ఇప్పుడు చేయకపోతే పగలు పరిగెత్తడానికి వీలవదని తెలిపాడు. ఉదయం 8 గంటలకు నిద్ర లేచి పనికి వెళ్లే ముందే వంట చేయాలి. అన్న నైట్ డ్యూటీ చేస్తాడు. అతడి కోసం కూడా ఆహారం వండాలి అన్నాడు.

నోయిడాలోని సెక్టార్ 16లోని మెక్ డొనాల్డో తాను ఉద్యోగం చేస్తానని చెప్పాడు. అక్కడి నుండి బరోలాలోని తన ఇంటి వరకు ప్రతిరోజూ 10-కిమీల దూరం పరిగెడతాననన్నాడు. తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారని కాప్రీ అడిగినప్పుడు, అనారోగ్యంతో ఉన్న తన తల్లి ఆసుపత్రిలో చేరిందని చెప్పాడు. నాన్న లేడని తెలిపాడు.

ప్రదీప్ తో పాటే కారుని పోనిస్తూ.. ఈ విషయం నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అది వైరల్ అవుతుంది అని కాప్రీ అన్నాడు.. "నన్ను ఎవరు గుర్తిస్తారు?" వైరల్ అయితే, ఫర్వాలేదు, నేను ఏమీ తప్పు చేయట్లేదు కదా అని ప్రదీప్ అనడంతో కాప్రీకి నోట మాట రాలేదు.

పోనీ నాతో డిన్నర్ చేయడానికి వస్తావా అని అడిగాడు కాప్రీ. దానికి కూడా ప్రదీప్ ఒప్పుకోలేదు.. మా అన్నయ్య ఆకలితో ఉంటాడు," నా కోసం ఎదురు చూస్తుంటాడు... అతడికోసం నేను త్వరగా వెళ్లి వంట చేయాలి అని బదులిచ్చాడు. "ప్రదీప్ సమాధానానికి కాప్రీ ముగ్ధుడయ్యాడు.. కనీసం మీ ఇంటి వరకైనా డ్రాప్ చేస్తాను అంటే

"లేదు లేదు, నేను ఇలాగే వెళ్తాను, లేకపోతే నాడే వేస్టయిపోతుంది. ఇది నేను రోజూ చేయాల్సిన ఎక్సర్ సైజ్. అని19 ఏళ్ల యువకుడు నవ్వుతూ సమాధానం చెప్పాడు ప్రదీప్.. దాంతో మరోసారి కాప్రీ మనసు దోచుకున్నాడు ప్రదీప్.

చివరగా కాప్రీ.. ప్రదీప్ కి శుభాకాంక్షలు తెలుపుతూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. "ప్రదీప్ కథ మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది" అని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాప్రీ.

పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే, ఈ వీడియో ట్విట్టర్‌లో 6.5 లక్షల మంది వీక్షించారు. 20వేల మందికి పైగా రీట్వీట్‌ చేశారు. వీడియోని చూసిన నెటిజన్లు ప్రదీప్ అకుంఠిత విశ్వాసాన్ని అభినందిస్తున్నారు. అతడు తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story