Zomato: ఆర్డర్ ఆలస్యంగా తెచ్చిన డెలివరీ బాయ్.. కస్టమర్ వినూత్న రీతిలో..

Video Viral: ఇంట్లో కూర్చుని టైమ్ చూసుకుంటూ ఆర్డర్ చేసిన ఫుడ్ ఇంకా రాలేదని చిందులు తొక్కుతుంటారు.. నో సహనం, నో ఓర్పు.. ఆర్డర్ చేసిన ఫుడ్ అరగంటలో వచ్చేయాలి. గంట ఆలస్యంగా వస్తే ఇంకేమన్నా ఉందా.. ఇంతెత్తున ఎగరరూ డెలివరీ బాయ్ మీద. కానీ ఆయన మాత్రం ఆరతి ఇచ్చి స్వాగతం పలికారు అతడికి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొందరు వ్యక్తులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వారి ఫుడ్ డెలివరీ ఏజెంట్‌లకు కాల్ చేస్తూనే ఉంటారు లేదా ఆలస్యంగా వచ్చినందుకు వారిని తిడుతుంటారు. ఇది పండుగ సీజన్. ఢిల్లీలో ప్రతిరోజూ వర్షాలు కురుస్తున్నాయి. జోరున కురుస్తున్న వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫుడ్ డెలివరీలు ఆలస్యం అవుతుంటాయి.
ఓ వ్యక్తి జొమాటో డెలివరీ ఏజెంట్ రాక కోసం అతని ఇంటి వద్ద వేచి ఉన్నారు. సారీ సర్ అలస్యమైంది అని ఆర్డర్‌ని అందజేజేయబోతే.. ఆ వ్యక్తి ఆయే ఆప్కా ఇంతేజార్ థా అని పాడుతూ డెలివరీ బాయ్‌కి స్వాగతం పలికారు. డెలివరీ బాయ్ చిరునవ్వుతో తన హెల్మెట్ తీసి బొట్టు పెట్టించుకున్నాడు. కస్టమర్ ఆరతి ఇస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. డెలివరీ బాయ్‌లు కూడా మనుషులే అని అర్థం చేసుకునే వాళ్లు ఇలాగే స్పందిస్తారు. కోపంతో డెలివరీ చేసిన వ్యక్తి మీద విరుచుకుపడడం కంటే ఇది వెయ్యి రెట్లు బెటర్ అని అంటున్నారు మరొకరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com