Zomato: ఆలోచన అదిరింది గురూ.. విభిన్నంగా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌

Zomato: ఆలోచన అదిరింది గురూ.. విభిన్నంగా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌
విభిన్నంగా పుట్టినరోజు జరుపుకున్న జొమాటో బాయ్‌... ఆర్డర్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ చాక్లెట్‌.. వైరల్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్‌...

ఆనందాన్ని పది మందితో పంచుకుంటే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. అదీ మనకు తెలియని వారితో పుట్టినరోజు జరుపుకుంటే..ఇదే ఆలోచన జొమాటో ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు వచ్చింది. అంతే అతను బర్త్‌డే జరుపుకున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అతడి విభిన్న ఆలోచనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఢిల్లీకి చెందిన కరణ్ ఆప్టే తన పుట్టిన రోజును ప్రత్యేకంగా జరపాలనుకున్నాడు. అందరికన్నా విభిన్నంగా ఏం చేయాలా అని ఆలోచించగానే అతన్ని మెదళ్లోకి టక్కున ఓ ఆలోచన వచ్చింది. పుట్టిన రోజు కూడా సెలవు తీసుకోకుండా డ్యూటీకి వచ్చిన ఈ జొమాటా బాయ్.. తన సొంత డబ్బులతో డెలివరీ ఆర్డర్ వచ్చిన ప్రతి ఒక్కరికీ ఫైవ్‌ స్టార్‌ చాక్లెట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.


జుమాటో డెలివరీ బాయ్‌ క‌ర‌ణ్ ఆప్టే తాను బర్త్ డే ఎలా జరుపుకున్నది వివరిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్‌తో పోస్ట్‌ చేశాడు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆక‌ట్టుకుంటోంది. ముందుగా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ష‌ర్ట్ కొనుక్కున్న అతడు..ఆపై ఆరోజు తాను పుడ్ డెలివ‌రీ చేసిన క‌స్టమ‌ర్లంద‌రికీ చాక్లెట్లు అందించి త‌న సంతోషాన్ని వారితో పంచుకున్నాడు. మ‌న పుట్టిన‌రోజు నాడు ఎవ‌రైనా గిఫ్ట్‌లు ఇస్తారేమోన‌ని ఎదురుచూస్తుంటాం..కానీ క‌ర‌ణ్ ఆప్టే త‌న ప్ర‌త్యేక‌మైన రోజును త‌న‌కు ప‌రిచ‌యం లేనివారికి సైతం చాక్లెట్లు పంపిణీ చేసి సెలబ్రేట్ చేసుకోవ‌డం గొప్ప విష‌య‌మ‌ని ప‌లువురు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్‌ను కొందరు జొమాటోకి ట్యాగ్ చేసి అతని పుట్టినరోజు జరపాలని.. బహుమతి ఇవ్వాలని కోరారు. జొమాటో నిజంగానే అతనికి పుట్టినరోజు కేక్ పంపింది. ఆప్తే కూడా జొమాటోకి కృతజ్ఞతలు చెబుతూ కేక్ పిక్‌ను అందరితో షేర్ చేసుకున్నారు. ఇలా కరణ్ ఆప్టే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్‌తో వైరల్ అయ్యాడు.

Tags

Next Story