వర్ణ వివక్షపై దేశీయ మహిళ న్యాయపోరాటం; బ్రిటీష్ విశ్వవిద్యాలయంపై విజయం
హైదరాబాద్

బ్రిటన్
ప్రపంచం వేగంగా ముందుకు దూసుకుపోతూనే ఉంది. విద్యా, వైజ్ఞానిక రంగాల్లో అత్యంత వేగంగా చోటుచేసుకుంటోన్న మార్పులు మానవాళి ఊహకు సైతం అందకుండా ఉన్నాయి. అయితే కాలం ఇంత వేగంగా పరుగెడుతుంటే, మనషుల ఆలోచనా విధానమే తిరోగమన దిశగా పయనిస్తోందా అనిపించేలా చేస్తాయి కొన్ని సంఘటనలు. అలాంటి ఓ ఘటనే బ్రిటన్ లో చోటుచేసుకుంది. ఓ విశ్వవిద్యాలయంలో భారత సంతతికి చెందిన అధ్యాపకురాలు వర్ణ వివక్షకు గురైన సందర్భం వెలుగు చూసింది. దీనిపై సదరు మహిళ న్యాయ పోరాటం చేసి విజయం సాధించింది.
బ్రిటన్ లోని పార్స్ మౌత్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కాజల్ శర్మ, మానవ వనరుల విభాగానికి అధ్యక్షురాలిగా ఐదేళ్ల కాంట్రాక్ట్ ను పూర్తి చేసుకున్నారు. అలా ఐదేళ్లు పనిచేసినవారు తిరిగి అదే పోస్ట్ కు రీ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే తన ధరఖాస్తును పరిశీలనలోకి తీసుకోకుండా ఆ స్థానంలో ఏమాత్రం అనుభం లేని శ్వేతజాతీయురాలిని తీసుకోవడంతో తనకు జరిగిన అన్యాయంపై కాజల్ శర్మ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఇద్దరి మినహా 12 మంది అధ్యాపకుల్లో 11మంది శ్వేతజాతీయులను తిరిగి రీ అప్పాయింట్ చేశారని శర్మ వెల్లడించారు.
యూనివర్శిటీ గ్రివియెన్స్ ప్రొసీజర్ ప్రకారం 2020లో ఫిర్యాదు చేసిన కాజల్ తనకు తనకు జరిగిన అన్యాయం బ్రిటీష్ సమానహక్కుల చట్టం 2010ని ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెలక్షన్ ప్రాసెస్ లోనే వర్ణ వివక్ష వేళ్లూనుకున్న విధానాన్ని వివరించారు. కాజల్ ఫిర్యాదుపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ తాాజాగా ఆమెకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. రయీస్ అనే వ్యక్తి ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించిన విధాానాన్ని తప్పుబట్టింది. ఇది కచ్చితంగా విర్ణ వివక్షేనంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చినప్పటికీ, కాజల్ కు అందాల్సిన నష్టపరిహారంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మేనేజర్ గ్యారీ రీస్ గతంలోనూ పలు సందర్భాల్లో తన పట్ల అనుచితంగా వ్యవహరించిన విధానాన్ని కాజల్ న్యాయస్థానానికి వివరించారు. తన తండ్రి చనిపోయినప్పుడు, తన కుమారుడు అనారోగ్యం పాలైన సందర్భాల్లో గ్యారీ కర్కశంగా వ్యవహరించాడని, తన పట్ల కనీస దయ లేకుండా ఎక్కువ పని చేయించేవాడని పేర్కొన్నారు. రెండేళ్ల న్యాయపోరాటం అనంతరం తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్న కాజల్, త్వరలోనే గర్వంగా విధులకు హాజరవ్వనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com