ఉక్రెయిన్ యుద్దాన్ని ప్రధాని మోదీ ఆపగలరు : అమెరికా
రష్యా -ఉక్రేయిన్ యుద్దాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆపగలరని అమెరికా పేర్కొంది. ఉక్రేయిన్ పై రష్యా చేస్తున్న యుద్దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆపగలరా అన్న ప్రశ్నకు వైట్ హౌజ్ ప్రతినిధి జాన్ కెర్బీ సమాధానం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడితే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ యుద్ధాన్ని విరమించుకోవచ్చని అన్నారు. అందుకు తాము స్వాగతిస్తామని తెలిపారు. మోదీ తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా అమెరికా ఒప్పుకుంటుదని అన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ను మాస్కోలో కలిసిన మరుసటి రోజు అమెరికా ఈ ప్రకటన చేసింది.
యుద్దాన్ని ఆపడానికి పుతిన్ కు సమయం ఉందని అన్నారు జాన్ కెర్బీ. యుద్దాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంతమంచిదని తెలిపారు. ప్రతీ రోజు యుద్దాన్ని ముగించే అవకాశం పుతిన్ కు ఉందని... దాన్ని వదిలేసి రాకెట్లను ప్రయోగిస్తున్నాడని తెలిపారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వం సమసిపోవడం ఎంతో మంచిదని ఆయన చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్దం మొదలైనప్పటినుంచి ప్రధాని నరేంద్ర మోదీ పలుసార్లు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్కీతో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య హింసను తక్షణమే నిలిపివేయాలని పీఎం మోడీ ఇంతకుముందే పిలుపునిచ్చారు. ఇందుకు అమెరికా స్వాగతించింది. మోదీ మాత్రమే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని తీసుకురాగలరని అమెరికా, ఉక్రెయిన్ బలంగా నమ్ముతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com