న్యూ జెర్సీలో ఘనంగా కిక్ ఆఫ్ మీటింగ్

న్యూ జెర్సీలో ఘనంగా కిక్ ఆఫ్ మీటింగ్
నూతన అధ్యక్షునిగా కళ్యాణ్ విజయ్ లక్కింశెట్టి బాధ్యతలు

ఐటీ సర్వ్ అలియాన్స్ నార్త్ ఈస్ట్ చాప్టర్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో 2023 కిక్ ఆఫ్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా కళ్యాణ్ విజయ్ లక్కింశెట్టి బాధ్యతలు స్వీకరించారు. అమెరికాలోని పలు కంపెనీలకు చెందిన 250 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . గెస్ట్ స్పీకర్స్ పావెల్ అండ్ సుమ్మి లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్ సంబంధించిన అంశాలను తెలియజేశారు. అంతేకాకుండా ఇమిగ్రేషన్ పానెల్ కు చెందిన వారు హెచ్ వన్ బి వీసా కు సంబంధించిన అంశాలు వివరించారు. అమెరికాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడమే తమ ఉద్దేశమని ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్పాన్సర్స్ కు, పాల్గొన్న వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు అర్బన్ తoడూర్ రెస్టారెంట్ నోరూరించే వంటకాలతో స్పెషల్ మెనూ సిద్ధం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story