అమెరికా - కెనడా సరిహద్దుల్లో భారతీయ కుటుంబం మృతి..!

అమెరికా - కెనడా సరిహద్దుల్లో భారతీయ కుటుంబం మృతి..!
అమెరికా - కెనడా సరిహద్దుల్లో బోటు ప్రమాదం, భారతీయ కుటుంబం మృతి, యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారన్న పోలీసులు

కెనెడా నుంచి అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించిన ఓ భారతీయ కుటుంబం చనిపోయిందని తెలిపారు పోలీసులు. రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిదిమంది వ్యక్తుల మృతదేహాలను కనుగొన్నట్లు కెనడా పోలీసులు తెలిపారు. కెనెడా నుంచి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవలో అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నించారని చెప్పారు. మృతుల్లో ఆరుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం మృతదేహాలు లభ్యమైనట్లు చెప్పారు. మృతులు రొమేనియా, భారత్ కు చెందినవారిగా దృవీకరించారు.

బుధవారం రాత్రి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. బోటు ప్రమాదం జరిగి అందులో ప్రయాణిస్తున్నవారు నీటిలో మునిగిపోయినట్లు చెప్పారు. మొత్తం 8 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. మృతుల్లో మూడు సంవత్సరాకన్నా తక్కువ వయస్సున్న పిల్లవాడు ఉన్నట్లు అక్వేసాస్నే మోహక్ పోలీస్ సర్వీస్ డిప్యూటీ చీఫ్ లీ - ఆన్ ఓ బ్రియాన్ మీడియాకు తెలిపారు.

ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. "ఇది హృదయ విదారకరమైన పరిస్థితి. ఏం జరిగిందో ఎలా జరిగిందో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇలాంటి ఘటనలు పురనావృత్తం కాకుండా ఉండేందుకు కృషి చేయాలి" అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జస్టిన్ ట్రూడో కెనడాకు అనధికారిక సరిహద్దు క్రాసింగ్ ల ద్వారా వచ్చే శరణార్థులను ఆపేందుకు గతవారం అంగీకరించారు.

Tags

Read MoreRead Less
Next Story