నాలుగేళ్ల బుడతడి గిన్నిస్‌ రికార్డ్‌ ఎందుకంటే..

నాలుగేళ్ల బుడతడి గిన్నిస్‌ రికార్డ్‌ ఎందుకంటే..

పసివాళ్లను చూస్తే చాలు ఎంత చిరాకులో ఉన్నా మొహాలపై వెంటనే చిరునవ్వు చిగురిస్తుంది. వారి బోసినవ్వులతో అప్పుడప్పుడే వస్తున్న జిలిబిలి పలుకులతో ఎంతో ముద్దుగా ముచ్చట చెబుతుంటే ఎలాంటి వారైనా మురిసిపోవాల్సిందే.. ఐదేళ్లు కూడా నిండని పిల్లలు సాధారణంగా అల్లరి చేస్తూ అమ్మవడిలో అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతుంటారు. కానీ అచ్చంగా ఐదేళ్లు కూడా నిండని ఓ బుడతడు ఏకంగా గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కేశాడు. ఎందుకంటే నాలుగేళ్ల వయస్సులోనే పుస్తకం రాశాడు. ఇంకేముంది అది తెలిసిన గిన్నిస్‌ వారు ఆ బుడతన్ని గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కించారు. అయితే UAEకి చెందిన సయీద్‌ రషీద్‌ అనే బాలుడు పుస్తకాన్ని రచించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రెండు జంతువుల మధ్య స్నేహాన్ని ప్రధాన అంశంగా తీసుకొని సయీద్‌ రాసిన " ది ఎలిఫెంట్‌ సయూద్‌ అండ్‌ ది బేర్‌" అనే పుసక్తం ఇప్పుడు UAEలో ఆదరణ పొందుతోంది.

Tags

Read MoreRead Less
Next Story