USA : గురుద్వారలో కాల్పులు... 17మంది అరెస్ట్

USA : గురుద్వారలో కాల్పులు... 17మంది అరెస్ట్

క్యాలిఫోర్నియాలోని పలు గురుద్వారాలలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. స్టక్ టన్, శాక్రమెంటోతోపాటు ఇతర ప్రదేశాలలోని గురుద్వారలో కాల్పులు జరుగగా... 17 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి ఏకే 47, హ్యండ్ గన్ తోపాలు పలురకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర అటర్నీ జనరల్ తెలిపారు. నిందితులు భారత్ లో అనేక హత్యలకు పాల్పడి వాంటెడ్ జాబితాలో ఉన్నట్లు చెప్పారు. అరెస్టయిన సభ్యులు, కాలిఫోర్నియా అటార్నీ జనరల్, సుట్టర్, శాక్రమెంటో, శాన్ జోక్విన్, సోలానో, యోలో, మెర్సిడ్ కౌంటీలలో ఐదు హత్యాయత్నాలతో సహా అనేక హింసాత్మక నేరాలతోపాటు కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు. ఆగస్ట్ 27, 2022న స్టాక్‌టన్ సిక్కు దేవాలయంలో జరిగిన సామూహిక కాల్పుల్లో, మార్చి 23, 2023న శాక్రమెంటో సిక్కు దేవాలయంలో జరిగిన కాల్పుల్లో కూడా ఈ గ్రూపుల సభ్యులు పాల్గొన్నారని పోలీసులు ఆరోపించారు.

Tags

Next Story