మోసం చేయడం మాకు చేతగాదు : లోకేష్

మోసం చేయడం మాకు చేతగాదు : లోకేష్
X

జగన్‌లా మాయమాటలు చెప్పడం, మోసం చేయడం తమకు చేతగాదని టీడీపీ యువనేత నారా లోకేష్‌ స్పష్టం చేశారు.. విజ్ఞులైన న్యాయవాదులు నిజానిజాలను గుర్తించాలన్నారు.. ఆదోని నియోజకవర్గం కుప్పగల్లులో యువనేత లోకేష్‌తో న్యాయవాదులు సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా పలు అంశాలను వారు లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు.. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుందని.. అధికారంలోకి వచ్చాక ఆ పని పూర్తిచేస్తామని లోకేష్‌ వారికి హామీ ఇచ్చారు.. పరిపాలన అంతా ఒకచోట ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది తమ విధానమని చెప్పారు. న్యాయ విభాగానికి సరైన నిధులు, మౌలిక వసతులు కల్పించకుండా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నిందించడం సబబు కాదన్నారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు కేటాయించి మౌలిక వసతులు మెరుగు పరుస్తామని చెప్పారు.. న్యాయవాదుల వల్లే జగన్‌ చేసిన అరాచకాలను కొంత వరకైనా అడ్డుకోగలిగామన్నారు.. జూనియర్‌ న్యాయవాదులకు స్టయిఫండ్‌ ఇస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించి ఆదుకుంటామని యువనేత లోకేష్‌ చెప్పారు.

Next Story