Sperm Donor : 600 మంది పిల్లలకు తండ్రి... ఇప్పటికైనా ఆపాలన్న కోర్టు

స్పెర్మ్ డొనేషన్ల ద్వారా 500 నుంచి 600మంది పిల్లలకు తండ్రయిన వ్యక్తిని ఇక స్పెర్మ్ డొనేషన్ ఆపివేయాలని డచ్ న్యాయస్థానం ఆదేశించింది. జోనాథన్ ( 41) అనే వ్యక్తి ఇకపై స్పెర్మ్ డొనేట్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది. 2017లోనే అతను నెదర్లాండ్ లోని ఫెర్టిలిటీ క్లీనిక్ లకు స్పెర్మ్ డొనేట్ చేయకుండా నిషేధించబడ్డాడు. నెదర్లాండ్ లో కూడా 100మందికి పైగా పిల్లలకు జన్మనిచ్చాడని నివేధిక పేర్కొంది. అయితే అతను డొనేట్ చేయడం మాత్రం ఆపలేదు. విదేశాలతో పాటు ఆన్ లైన్ లో కూడా స్పెర్మ్ దానం చేస్తునే ఉన్నాడు.
ఒక దాత 12 కుటుంబాలలో 25మంది కంటే ఎక్కువ మంది పిల్లలకు స్పెర్మ్ దానం చేసి తండ్రి కాకూడదని డచ్ క్లినికల్ మార్గదర్శకాలు చెబుతున్నాయి. కాగా... 2007లో స్పెర్మ్ దానం చేయడం ప్రారంభించినప్పటినుంచి జోనాథన్ ఇప్పటివరకు 550 నుంచి 600మంది పిల్లలకు తండ్రి అయినట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అతను స్పెర్మ్ దానం చేయడం ఆపాలని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. అతని స్పెర్మ్ ఉన్న హాస్పిటల్స్ దానిని నాషనం చేయాలని ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com