England : కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి

England : కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి

కింగ్‌ ఛార్లెస్-3 పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ బ్రిటన్‌లో పట్టాభిషేకం జరుగుతోంది. కిందటి ఏడాది క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణించగా.. ఆమె కుమారుడు ఛార్లెస్‌ని రాజుగా ప్రకటించింది రాజప్రసాదం. అయితే పట్టాభిషేకం మాత్రం దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు జరుగుతోంది.సెంట్రల్ లండన్ మీదుగా నో-ఫ్లై జోన్‌ను ప్రకటించడంతో పాటు రూఫ్‌టాప్ స్నిపర్‌, రహస్య అధికారులు, అలాగే ఎయిర్‌పోర్ట్-స్టైల్ స్కానర్‌లు, స్నిఫర్ డాగ్‌లతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

వెస్ట్ మినిస్టర్ అబేలోని బకింగ్ హమ్ ప్యాలెస్​లో అత్యంత ఆడంబరంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు.మధ్యయుగం నాటి అధికారానికి సూచికలైన మంత్రదండం,గోళాన్ని రాజదంపతులకు మతపెద్దలు అప్పగించనున్నారు. అలాగే క్వీన్ కు కూడా కిరీటం తొడగనున్నారు. సైనికులు, బ్యాండ్ పార్టీ లండన్‌ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించనున్నారు. పట్టాభిషేకంలో కిరీటంతో పాటు ఇతర ఆభరణాలన్నీ కలిపి సుమారు 100 దాకా ఉంటాయి. వీటిలో 23వేల రత్నాలు, పగడాల్లాంటివి అమర్చారు. పట్టాభిషేకం కాగానే వీటన్నింటినీ టవర్‌ ఆఫ్‌ లండన్‌లో దాచి ఉంచుతారు.పట్టాభిషేకంలో ధరించే రాజాభరణాల విలువ 300 కోట్ల నుంచి 500 కోట్ల పౌండ్లు ఉంటుందని ఓ అంచనా. అయితే వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాణి కిరీటం లోంచి ప్రతిష్ఠాత్మక కోహినూర్‌ వజ్రాన్ని ఈసారి తొలగించారు.

ఇక 1953 తర్వాత బ్రిటన్‌లో ఇదే తొలి పట్టాభిషేకం. కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ మొదట కింగ్‌ ఛార్లెస్‌ను ఆహూతులకు పరిచయం చేస్తారు. నాలుగు దిక్కులా రాజు తిరుగుతుంటే ఈ పరిచయం కొనసాగుతుంది. గాడ్‌ సేవ్‌ కింగ్‌ అంటూ మతపెద్దలు రాజును ఆశీర్వదిస్తారు. ప్రమాణం పూర్తికాగానే...1300 సంవత్సరంలో కింగ్‌ ఎడ్వర్డ్‌ చేయించిన సింహాసనంపై చార్లెస్‌ కూర్చుంటారు.వెంటనే ఆర్చ్‌బిషప్‌ కింగ్‌ ఛార్లెస్‌ను పవిత్ర నూనెతో అభిషేకిస్తారు. చేతులు, ఛాతీ, తలపై నూనెను పోస్తారు. ఇదంతా రసహ్యంగా జరుగుతుంది. జెరూసలెంలోని మౌంట్‌ ఆఫ్‌ ఆలివ్స్‌లోని ఆలివ్‌ చెట్ల నుంచి తీసిన నూనెను గులాబీ, మల్లె లాంటి సుగంధాలతో కలిపి తయారు చేస్తారు.

ఇక పట్టాభిషేకానికి ఒకరోజు ముందు లండన్ వీధుల గుండా వెస్ట్ మినిస్టర్ కు ఊరేగింపుఉంటుంది.1937 నుంచి రాజుతో పాటు రాణికి కూడా కిరీటం తొడిగే ఆచారాన్ని పాటిస్తున్నారు. అలా కిరీటం ధరించిన చివరి క్వీన్ ఎలిజబెత్. ఈమె కింగ్ జార్జ్ 6 భార్య. పట్టాభిషేకానికి ద వెడింగ్ రింగ్ ఆఫ్​ఇంగ్లండ్ అని పిలుస్తారు. ఇక యూకే సాయుధ బలగాలకు చెందిన 6 వేల మందితో పాటు కామన్ వెల్త్ దేశాల నుంచి 400 మంది కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకానికి హాజరుకానున్నారు.

Tags

Next Story