ఛార్లెస్ పట్టాభిషేకానికి హాజరవుతోన్న భారతీయులు వీరే
బ్రిటన్ యువరాజు ఛార్లెస్ పట్టాభిషేకానికి బకింగ్ హమ్ రాజసౌథం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. బ్రిటన్ చక్రవర్తిగా ప్రిన్స్ ఛార్లెస్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో దేశ విదేశాల నుంచి ఛార్లెస్ కు అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. ఇక అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకలు హేమాహేమీలు అయినటువంటి అతిరథ మహారథులు విచ్చేయనున్నారు అనడంలో సందహేమేలేదు. ఈ క్రమంలో భారత్ నుంచి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు బకింగ్ హమ్ ప్యాలెస్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ జాబితాలో భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధాన్కర్, నటి సోనమ్ కపూర్ కు పట్టాభిషేకానికి హాజరవ్వాల్సిందిగా ఆహ్వానం అందింది. వీరితో పాటూ ముంబైలోని డబ్బావాలాలకు కూడా ఆహ్వాన పత్రిక అందింది. వారు ఛార్లెస్ కు తలకు కట్టుకునే సంప్రదాయ పునేరి, వర్కారీ తెగ వారు రూపొందించిన ప్రత్యేకమై శాలువాను బహుకరించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com