AP : ఎమ్మెల్యే వెంకటే గౌడ వీరంగం

AP : ఎమ్మెల్యే వెంకటే గౌడ వీరంగం

చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ వీరంగం సృష్టించారు. అయన రౌడీలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మహిళా అధికారిణిపై ఎమ్మెల్యే ప్రవర్తన బాగాలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రెండు రోజుల క్రితం అనుమతులు లేవని గ్రానైట్‌ వాహనాన్ని ఆపి పరిశీలించారు డీసీటీవో ఇందిరా ప్రియదర్శిని. అయితే సమాచారం అందుకొన్న ఎమ్మెల్యే తన అనుచరులతో అక్కడకు చేరుకొని తన వాహనాలనే ఆపుతావా అంటూ డీసీటీవోని దుర్భాషలాడారు. అంతే కాకుండా పక్కనే ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ పై దాడి చేశారు అనుచరులు. ఎమ్మెల్యే వెంకటే గౌడ తీరుపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. అక్రమంగా గ్రానైట్‌ రవాణ చేయడమే కాకుండా..ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story