పాకిస్థాన్‌లో అల్లకల్లోలం
By - Subba Reddy |11 May 2023 7:15 AM GMT
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో పాకిస్తాన్‌లో అల్లకల్లోలంగా మారిపోయింది. పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతున్నాయి
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో పాకిస్తాన్‌లో అల్లకల్లోలంగా మారిపోయింది. పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతున్నాయి. తాజా అల్లర్లలో 8 మంది ఆందోళనకారులు మృతి చెందగా.. వంద మందికి పైగా గాయపడ్డారు. అటు.. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్- ఇ- ఇన్సాఫ్- పీటీఐకి చెందిన వందల మంది నేతలను అరెస్ట్ చేశారు.
పాక్‌లో మొత్తం 3 చోట్ల ప్రభుత్వం సైన్యాన్ని దింపింది. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు 8 రోజల కస్టడీకి పంపింది. ఐతే.. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ఈ సాక్ష్యాల ఆదారంగా దర్యాప్తు కొనసాగిస్తుందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com