సుప్రీం ఉత్తర్వులపై ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య రియాక్షన్‌

సుప్రీం ఉత్తర్వులపై ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య రియాక్షన్‌
పాకిస్థాన్‌ మాజీ ప్రధానీ ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన మాజీ భార్య స్పందించింది

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన మాజీ భార్య స్పందించింది. ఫిలిం ప్రొడ్యూసర్‌ అయిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ మాజీ భర్త ఇమ్రాన్‌ఖాన్‌ విడుదల పట్ల ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. చివరకు కనువిప్పు కలిగింది అన్న భావం స్ఫురించే విధంగా "Finally sense has prevailed" అని పాకిస్థాన్‌ జెండా,నమస్కరిస్తున్నట్లు ఎమోజీనీ పోస్ట్‌ చేసింది. జెమీమా, ఇమ్రాన్‌ ఖాన్‌ 1995లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2004 లో ఇమ్రాన్‌ఖాన్‌ రాజకీయ జీవితంలో ఇమడలేక అతనికి విడాకులు ఇచ్చిన జెమీమా తన కుమారులైన సులేమాన్‌, కాసింతో కలిసి బ్రిటన్ కు వలసపోయింది.

Tags

Read MoreRead Less
Next Story