Uganda cop: బ్యాంకు రుణం కట్టమన్నందుకు ఉద్యోగిని చంపిన కానిస్టేబుల్

Uganda cop: బ్యాంకు రుణం కట్టమన్నందుకు ఉద్యోగిని చంపిన కానిస్టేబుల్
X

బ్యాంకు రుణాన్ని కట్టమని అడిగినందుకు అధికారిని కాల్చి చంపాడు ఓ కానిస్టేబుల్. ఈ ఘటన ఉగాండా రాజధాని కంపాలాలో జరిగింది. బ్యాంకు అధికారి భారత జాతీయుడని పోలీసులు తెలిపారు. రూ.49వేల అప్పును కట్టాలని బ్యాంకు అధికారి అయిన ఉత్తమ్ భండారీ అప్పుతీసుకున్న ఇవాన్ వార్ వెబ్ ను కోరాడు. ఇవాన్ వార్ వెబ్ స్థానికంగా కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే బ్యాంకు అధికారి అప్పు కట్టమన్నందుకు ఆగ్రహించిన వార్ వెబ్ బ్యాంకు అధికారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవాన్ వార్ వెబ్ స్థానికంగా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని చేస్తున్నాడు. అతను బ్యాంకు నుంచి అప్పు తీసుకోగా, అది వడ్డీతోసహా రూ.49వేల రూపాయలు అయింది. ఆ విషయాన్ని బ్యాంకు అధికారి అయిన ఉత్తమ్ కానిస్టేబుల్ ఇవాన్ ను పిలిచి చెప్పాడు. తాను అన్ని రూపాయలు బాకీలేనని అన్నాడు. అంతలోనే కోపంతో ఊగిపోయి ఉత్తమ్ పై ఏకే 47తో పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కంపాలా మెట్రోపాలిటన్ పోలీసు ప్రతినిధి, పాట్రిక్ ఒన్యాంగో మాట్లాడుతూ, వాబ్‌వైర్ తన AK-47 రైఫిల్‌ తో భండారీని కాల్చి చంపిన తర్వాత గన్ ను అక్కడే వదిలి పారిపోయాడని చెప్పారు. ఘటనా స్థలం నుంచి 13 కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాబ్‌వైర్‌కు మెంటల్ ఇల్ నెస్ ఉందని పోలీసులు తెలిపారు. మానసిక క్షీణతతో రెండుసార్లు ఆసుపత్రిలో చేరిన తర్వాత తుపాకీని కలిగి ఉండకుండా ఐదేళ్ల క్రితం నిషేధం విధించినట్లు చెప్పారు.

Tags

Next Story