China: అమ్మమ్మ కోసం .... 24 గం.లు సైకిల్ తొక్కుకుంటూ...

X
By - Chitralekha |13 April 2023 1:22 PM IST
తల్లితో గొడవ పడి అమ్మమ్మ దగ్గరకు పరిగెత్తడం అందరికీ అలవాటే. కానీ, అమ్మమ్మ వేరే ఊరిలో ఉంటేనే అసలు తంటా. అయితే చైనాలో ౧౧ఏళ్ల ఓ బుడతడు అమ్మమ్మ వేరే ఊరిలో ఉన్నా లెక్కచేయకుండా అమ్మ మీద కోపంతో ఆమె వద్దకు ప్రయాణమయ్యాడు. సైకిల్ తొక్కుకుంటూ హైవే పైన సైన్ బోర్డ్ లను ఫాలో అవుతూ సుమారు 130 కి.మీ.లు ప్రయాణించాడు. కానీ, ఎంత జాగ్రత్తగా సైన్ బోర్డ్ లను ఫాలో అయినా రాంగ్ రూట్ లలో ప్రయాణించడం వల్ల అనుకున్న దానికన్నా తన గమ్యానికి చేరుకోవడానికి ఎక్కువ సమయమే పట్టింది. అయితే ఈ క్రమంల ో ఆకలి వేస్తే తినేందుకు ఇంటి నుంచి తెచ్చుకున్న బ్రెడ్, కాస్త మంచి నీళ్లతో కడుపు నింపుకున్నాడు. అయినా 24గంటలు ఎకాఎకిన సైకిల్ తొక్కడంతో పూర్తిగా నీరసించిన పోయిన చిన్నారిని కనుగొన్న పోలీసులు అతడికి ప్రాథమిక చికిత్స అందించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిన్నారి తల్లిదండ్రులతో పాటూ, అతడి అమ్మమ్మ కూడా హుటాహుటిన స్టేషన్ కు తరలి వచ్చారు. తమ కుమారుడు బాగానే ఉన్నాడని తెలుసుకుని కాస్త స్థిమిత పడ్డారు. ప్రస్తుతం ఈ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com