Sandstorm : చైనా నుంచి దక్షిణ కొరియా, జపాన్ కు వ్యాపించిన ఇసుక తుఫాను

Sandstorm : చైనా నుంచి దక్షిణ కొరియా, జపాన్ కు వ్యాపించిన ఇసుక తుఫాను

చైనాను నెలరోజులుగా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఇసుక తుపాను ఇప్పుడు దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు కూడా వ్యాపిస్తోంది. ఈ ఇసుక తుపాను ఇవాళ జపాన్‌ను కూడా తాకవచ్చని అంచనా వేస్తున్నారు. టోక్యో నగరం కూడా దీని పరిధిలోకి రానుందని చెబుతున్నారు. సోమవారం రాత్రి నుంచి చైనాలోని 18 ప్రావిన్సులు, ప్రధాన నగరాలు ఇసుక తుపానులో చిక్కుకుపోయాయి. చైనాలో షాంక్సీ, హెబై, షాంగ్‌డాంగ్‌, జింగ్సూ, అన్‌హుయ్‌, హెనాన్‌, హుబే, ఇన్నర్‌ మంగోలియా ప్రాంతాలు కూడా ఇసుక తుపాను బారిన పడే అవకాశాలున్నాయి. చైనాలోని గోబి ఎడారి నుంచి బయల్దేరిన ఇసుక రేణువులు సియోల్‌లో ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయినట్లు గుర్తించారు. ఇవాళ ఈ భారీ ఇసుక తుపాను బీజింగ్‌తోపాటు ఇతర ప్రధాన నగరాలను కమ్మేస్తుందంటున్నారు అధికారులు.

ఈ తుపానులో అనేక మంది చిక్కుకుపోయారు. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. బీజింగ్‌లో ఇప్పటికే ఈ ప్రభావం పెరిగినట్లు గుర్తించారు. బీజింగ్‌ భౌగోళికంగా గోబి ఎడారికి అత్యంత సమీపంలో ఉంది. దీంతో పొడి వాతావరణం కారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తరచూ ఇసుక తుపాన్లు వస్తుంటాయి. 1960ల్లో వచ్చిన ఇసుక తుపాన్లకు నాలుగు రెట్లు ఇప్పుడు వస్తున్నాయని వెల్లడించారు చైనా అధికారులు

Tags

Read MoreRead Less
Next Story