హమాస్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

బుధవారం తెల్లవారుజామున గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాట్లాడుతూ 'ఇజ్రాయెల్ పౌరులపై గాజా నుంచి డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించినందుకు ప్రతిస్పందనగా వైమానిక దాడులు జరిపినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్న పాలస్తీనియన్ నిరాహారదీక్షకు ప్రతిస్పందనగా గాజాలోని సాయుధ దళాలు ఇజ్రాయెల్ వైపు రాకెట్ బారేజీలను ప్రయోగించడంతో పరిస్థితి తీవ్రమైంది.
గాజా స్ట్రిప్‌లోని అనేక ప్రదేశాలపై పలు వైమానిక దాడులు జరిగాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీని లక్ష్యంగా చేసుకుని గాజా ప్రయోగించిన రాకెట్లకు బదులుగా ఈ దాడి జరిగినట్లు అధికారులు దృవీకరించారు. సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దక్షిణ ఇజ్రాయిల్ లో 35కు పైగా రాకెట్ లాంచర్లను గాజా ప్రయోగించినట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com