Iraq Fire Accident: ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం…

ఇరాక్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ఇరాక్‌లోని అల్-హమ్దానియా పట్టణంలోని ఒక ఈవెంట్ హాల్‌లో వివాహ సమయంలో మంటలు చెలరేగడంతో 100 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇరాక్‌లోని అల్-హమ్దానియాలోని ఈవెంట్ హాలులో వివాహ వేడుక జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 100మంది సజీవ దహనమయ్యారు.
వివాహ మండపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 100 మంది సజీవ దహనం అయ్యారు. హమ్దానియాలోని నినెవే ప్రావిన్సులో జరిగిన దుర్ఘటనలో 150 మందికి పైగా అతిథులకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. మండే స్వభావం ఉన్న వస్తువులను కల్యాణమండపంలో ఎక్కువగా ఉంచడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎగసిపడిన మంటల్లో ఈవెంట్ హాలు కాలిపోయింది. ఇరాక్ సెమీ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఫెడరల్ ఇరాకీ అధికారులు అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు. ఈ ఘోర అగ్నిప్రమాదంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. సంఘటన స్థలంలో ఎటు చూసినా సజీవ దహనమైన మృతదేహాలు కనిపించాయి. గాయపడిని వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడి వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com