Yellow Tongue: పసుపు రంగులో నాలుక.. బాలుడికి సోకిన అరుదైన వ్యాధి

Yellow Tongue: కామెర్లు వస్తే కళ్లు పచ్చగా ఉంటాయి కానీ నాలుకేంటి ఇంత పసుపు రంగులో ఉందని ఆ బాలుడి తల్లిదండ్రులు కలవర పడ్డారు. కెనడాకు చెందిన 12 ఏళ్ల బాలుడు గొంతు, కడుపు నొప్పి, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. నాలుక పసుపుపచ్చగా
మారడంతో వైద్యులు పరీక్షించి బాలుడు అగ్లుటినే అనే వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించారు. ప్రారంభంలో, టొరంటోలోని పిల్లల హాస్పిటల్ వైద్యులు బాలుడికి కామెర్లు ఉన్నట్లు నిర్ధారించారు. కొన్ని పరీక్షలు నిర్వహించిన
తరువాత, వైద్యులు బాలుడికి రక్తహీనత ఉందని నిర్ధారించారు. ఈ వ్యాధి సాధారణంగా బాల్యంలోనే ప్రజలకు సోకుతుంది. బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇది ఒక అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు తెలిపారు. ఇది వ్యక్తి
యొక్క రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. యుఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి రక్తహీనతకు దారితీస్తుంది. ఇది కామెర్ల వ్యాధికి
కారణమవుతుంది అని వైద్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com