Pakistan : నదిలో పడిన పెళ్లి బస్సు.. 14మంది మృతి

పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు సింధు నదిలో పడిపోవడం వల్ల 16 మంది మృతి చెందగా, పెళ్లి కూతురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించామని, మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అస్తోర్ నుంచి పంజాబ్లోని చక్వాల్ జిల్లాకు వెళ్తున్న ఈ పెళ్లి బస్సు, పాకిస్థాన్లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని ఓ వంతెన పై నుంచి వెళ్తూ, సింధునదిలో పడిపోయింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 22 మంది ఉన్నారని రెస్యూ అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ రోడ్లు అధ్వాన్నంగా ఉండడం, ఉన్నవాటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని డాన్ రిపోర్ట్ పేర్కొనడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com