Hamas: రెండవ బ్యాచ్‌లో ఇజ్రాయెల్ బందీలను విడుదల

Hamas: రెండవ బ్యాచ్‌లో  ఇజ్రాయెల్ బందీలను విడుదల
తీవ్ర జాప్యం అనంతరం రెండవ బ్యాచ్

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఇరు వైపులా ఖైదీలు, బందీల విడుదల జరుగుతోంది. యూదు దేశం పాలస్తీనాకు చెందిన ఖైదీలను విడుదల చేయడంతో పాలస్తీనియన్లు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. పాలస్తీనా, హమాస్‌కు చెందిన జెండాలను పట్టుకొని బాణాసంచా కాల్చారు. ఇజ్రాయెల్‌ నుంచి విడుదలైన ఖైదీలను స్థానిక ప్రజలు భుజానికి ఎత్తుకొని ఊరేగించారు. ఇజ్రాయెల్ విడుదల చేసిన 24 మంది మహిళా ఖైదీల్లో ఫాతిమా ఒకరు. ఆమెతో పాటు 15 మంది యువకులను యూదు దేశం విడిచిపెట్టింది. వీరిలో పలువురు ఇజ్రాయెల్ భద్రతా సిబ్బందిపై దాడికి యత్నించగా మరికొందరు ఇజ్రాయెలీలపై దాడులు చేయాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. దీంతో వారిని ఇజ్రాయెల్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. హమాస్‌ ఒప్పందంలో భాగంగా వారిని విడిపెడుతున్నారు.


యాబాద్‌ పట్టణంలోతన ఇంటికి యువతి ఫాతిమా చేరుకోవడంతో ఆమె కుటుంబసభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఫాతిమాను చూసి ఆమె తల్లి భావోద్వేగానికి గురై కంటితడి పెట్టుకున్నారు. జెరూసలేంలో పోలీసు అధికారిని..కత్తితో పొడిచేందుకు ఫాతిమా ప్రయత్నించడంతో.... ఆమెను ఈ ఏడాది మెుదట్లో అరెస్ట్ చేశారు. మెుదట్లో గాజాలో ఏం జరుగుతుందో తెలిసేది కాదని ఫాతిమా తెలిపారు. ఎప్పుడైతే హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిందనే విషయం తెలుసుకున్నామో అప్పట్నుంచి..... తమకు స్వేచ్ఛ లభిస్తుందనే ఆశ నెలకొందని చెప్పారు. అల్‌-అక్సా మసీదుతో పాటు ఖైదీలందరికీ విముక్తి లభించేవరకు ఈ పోరు కొనసాగుతుందని తెలిపారు.

హమాస్‌ కూడా ఒప్పందంలో భాగంగా తొలివిడతగా..24 మంది బందీలను విడిచిపెట్టింది. అందులో 13 మంది ఇజ్రాయెలీలు, 10 మంది థాయ్ జాతీయులు,ఒక ఫిలిప్పీన్స్ పౌరుడు ఉన్నారు. ఇజ్రాయెల్‌, హమాస్‌ కూడా తమ వద్ద ఉన్న ఖైదీలు, బందీలను రెడ్‌ క్రాస్‌ సంస్థకే అప్పగించాయి. హమాస్‌ విడిచిపెట్టిన బందీలను.. రెడ్‌ క్రాస్ సంస్థ రఫా సరిహద్దు గుండా ఈజిప్టుకు తరలించింది. హమాస్ విడుదల చేసిన బందీలను ఇజ్రాయెల్ సైన్యం ఈజిప్టు నుంచి హెలికాప్టర్లలో... స్వదేశం తరలించింది. మెుదట వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందించింది. హమాస్ విడుదల చేసిన బందీల్లో అత్యధికులు ఆరోగ్యంగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. వైద్య పరీక్షల తర్వాత.... బందీలను కుటుంబ సభ్యులతో కలిసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో... అత్యవసర సామాగ్రితో పాటు నిత్యావసరాలను తీసుకెళ్లే ట్రక్కులు రఫా సరిహద్దు గుండా గాజాలోకి చేరుతున్నాయి. రోజుకు 150 ట్రక్కుల అత్యవసర సామగ్రి..ఈ 4 రోజుల్లో గాజాకు రవాణా కానుంది. అయితే కాల్పులు విరమణ అమల్లో ఉన్నా గాజాలో రాత్రి వేళ రాకెట్లు దూసుకెళ్లగా, పేలుళ్లు వినిపించాయి.

Tags

Read MoreRead Less
Next Story