Teacher punishment: టీచర్ దారుణం.. పనిష్మెంట్ పేరుతో ఆ బాలికని..

Teacher punishment: పిల్లలకి టీచర్లు పాఠాలు చెప్పాలి.. పనిష్మెంట్లూ ఇవ్వాలి. అలా అయితేనే చదువూ వస్తుంది. టీచర్ అంటే కాస్త భయమూ ఉంటుంది. అయితే ఆ పనిష్మెంట్ శృతి మించితే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. కొందరు టీచర్లు మరీ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంటారు. చిన్నారులని కూడా చూడకుండా పెద్ద పనిష్మెంట్లు ఇస్తుంటారు. తాజాగా చైనాలో చోటు చేసుకుంది ఈ ఘటన.
ఆ అమ్మాయి వయస్సు 14 సంవత్సరాలు మరియు ఆమె నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఉన్నత పాఠశాల హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది. ఓ ఆ అమ్మాయి బెడ్ పక్కన కొన్ని స్నాక్స్ ప్యాకెట్స్ చూసింది విజిటింగ్ వచ్చిన టీచర్. ఆ స్నాక్స్ తనవి కాదని ఆ అమ్మాయి టీచర్‌కి చెప్పినా వినిపించుకోకుండా 300 సిట్-అప్‌లు చేయమంటూ పనిష్మెంట్ ఇస్తూ ఓ పర్యవేక్షకుడిని కూడా నియమించి వెళ్లింది.
అసలే ఆ అమ్మాయికి అప్పటికే కాలికి గాయమైంది. ఆ విషయం తెలిసి కూడా ఒక్కరూ టీచర్‌కి చెప్పలేకపోయారు. అతి కష్టం మీద ఆ అమ్మాయి 150 సిట్-అప్‌లు చేసింది. ఆ తరువాత కుప్పకూలిపోయింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చివరకు వైద్యులు ఆమె నడవలేదని, కాలి నరాలు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. ఆమె క్రచెస్ సహాయంతో నడవాల్సి వస్తుందని చెప్పారు. ఆ రోజు నుండి, అమ్మాయి షాక్‌లో ఉంది. డిప్రెషన్‌కి సంబంధించిన ఔషధాలను కూడా తీసుకోవాల్సి వస్తోంది.
బాలిక పరిస్థితిని తెలుసుకున్న స్కూలు యాజమాన్యం అందుకు కారణమైన ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. బాలిక తల్లిదండ్రులకు రూ .13 లక్షల పరిహారాన్ని చెల్లించాలని పాఠశాల టీచర్‌ని కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com