చైనా బొగ్గు గనిలో ప్రమాదం.. 16 మంది మృతి

చైనా బొగ్గు గనిలో ప్రమాదం.. 16 మంది మృతి
X
చైనాలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్ మున్సిపాలిటీలో

16 killed in china coal mine

16 killed, china, coal mine,

చైనాలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్ మున్సిపాలిటీలో సాంగ్‌జౌ బొగ్గు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఎప్పటిలాగే పనిలోకి వచ్చిన కూలీలు.. ప్రమాదవశాత్తూ గనిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ స్థాయి పెరుగడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 17 మంది ఈ గనిలో చిక్కుకోగా ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ బొగ్గు గనిని స్థానిక జిల్లా ప్రభుత్వం నడిపిస్తుంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags

Next Story