అంతర్జాతీయం

కరోనా టీకాలపై బ్రిటన్ ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు..

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ప్రస్తుత తరుణంలో అధికారి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

కరోనా టీకాలపై బ్రిటన్ ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు..
X

ఇంకేముంది కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుంది.. ఇంక మనం హ్యాపీగా ఉండొచ్చనుకుంటే పొరపాటే అని అంటున్నారు బ్రిటన్ ఉన్నతాధికారి, ప్రత్యేక కరోనా టీకా టాస్క్ ఫోర్స్ చీఫ్ కేట్ బింగమ్. మేం ముందంటే మేం ముందంటూ వ్యాక్సిన్ తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్న ఫార్మా సంస్థలకు ఇది ఒక హెచ్చరికలాంటిదే. ఇవి పూర్తి సామర్ధ్యంతో పనిచేయకపోవచ్చని ఆమె అంటున్నారు. కరోనా నుంచి ప్రతి ఒక్క్రరినీ ఇవి రక్షించలేకపోవచ్చని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ప్రస్తుత తరుణంలో అధికారి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

తొలి తరం వ్యాక్సిన్లు కరోనా నుంచి పూర్తి రక్షణ కల్పించలేకపోవచ్చు. కరోనా సోక కుండా టీకా కట్టడి చేయలేదు. కేవలం వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గిస్తుందని, అయితే అది కూడా ప్రతి ఒక్కరి విషయంలో నిజం కాకపోవచ్చని ఆమె అన్నారు. అంతే కాకుండా ఈ తొలి తరం టీకాలు అనేకం విఫలం కావొచ్చని కూడా ఒక అభిప్రాయం ఉంది. 65 ఏళ్లు పైబడిన వారికి రక్షణ కల్పించే టీకాలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని అన్నారు.

ప్రపంచానికి కోట్ల సంఖ్యలో టీకా అవసరం ఉందని, కానీ ప్రస్తుతం ఉన్న టీకా సామర్థ్యం అసలే మాత్రం సరిపోదని తేల్చి చెప్పారు. బ్రిటన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక వ్యవస్థ తగ్గే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనం అంచనా వేసింది. రెండో సారి కరోనా దాడిచేయవచ్చనే అంచనాతో బ్రిటన్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని టెలిగ్రాఫ్ పత్రిక ఇటీవల వెల్లడించింది.

Next Story

RELATED STORIES