Oman Drone Attack: ఒమన్‌లో డ్రోన్ దాడి... ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడి కారణంగా ఒమన్ దేశంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. ఒమన్‌లోని సోహార్ నగరంలో ఈ దాడి జరిగింది. దాడిలో మరో పదకొండు మందికి గాయాలు అందులో 10 మంది భారతీయులేనని తెలుస్తోంది. ఐదుగురు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వెల్లడించింది.
డ్రోన్ దాడిలో గాయపడిన మిగిలిన వారు కూడా చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఒమన్ అధికారులు, సంబంధిత కంపెనీ ప్రతినిధులతో టచ్‌లో ఉన్నట్లు తెలిపింది. వారికి అవసరమైన సాయం అందిస్తున్నామని వెల్లడించింది.
ఇదిలా ఉండగా, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 1.50 లక్షల మంది భారత్‌కు వచ్చినట్లు భారత విదేశాంగ తెలిపింది. ఒమన్ డ్రోన్ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఒమన్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, సోహార్‌లో రెండు డ్రోన్ దాడులు జరిగాయి. ఇందులో ఒకటి అల్ అవి ఇండస్ట్రియల్ జోన్‌ను తాకిందని, ఇక్కడ పనిచేసే భారతీయులు ఇద్దరు మృతి చెందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
