ఆసుపత్రిని ధ్వంసం చేసిన రష్యా క్షిపణి

ఆసుపత్రిని ధ్వంసం చేసిన రష్యా క్షిపణి
X
ఇది మానవత్వానికి మాయని మచ్చగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు

రష్యా ప్రయోగించిన క్షిపణి ఉక్రెయిన్ లోని ఓ హాస్పిటల్ ను ద్వసం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 30మంది గాయపడ్డారు. ఇది మానవత్వానికి మాయని మచ్చగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. సైకలాజికల్ క్లినిక్ మరియు వెటర్నరీ క్లినిక్ దెబ్బతిన్నట్లు చెప్పారు. 69 ఏళ్ల వ్యక్తి క్లినిక్ దాటుతుండగా హత్యకు గురయ్యాడని, శిథిలాల నుంచి మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసినట్లు ప్రాంతీయ గవర్నర్ సెర్హి లైసాక్ తెలిపారు. ఇద్దరు పిల్లలతో సహా 30 మంది గాయపడ్డారని చెప్పారు. యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ జెనీవా ఒప్పందాల ప్రకారం ఈ దాడిని తీవ్రమైన యుద్ధ నేరంగా పేర్కొంది. ఇది యుద్ధంలో పౌరులతో ఎలా ప్రవర్తించాలో రష్యా తెలుసుకోవాలని అన్నారు.

ఉక్రెయిన్ మందుగుండు సామాగ్రి డిపోలపై రాత్రిపూట దాడులు చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మాస్కో దాని సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలను తోసిపుచ్చారు రష్యాన్ అధికారులు. 15 నెలల క్రితం దాడి చేసినప్పటి నుండి ఉక్రెయిన్ అంతటా నగరాలపై బాంబు దాడి చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలను ఖండించింది.

Tags

Next Story