USA : ‘బ్రైన్ ఈటింగ్ అమీబా'

USA :  ‘బ్రైన్ ఈటింగ్ అమీబా
X
నీటిద్వారా శరీరం లోకి వెళ్ళి మెదడుకు చేరే వ్యాధి

అమెరికాలో ఓ రెండేళ్ల బాలుడు ఫౌలెరి అనే ఇన్ఫెక్షన్‌తో చనిపోయాడు. నెగ్లేరియా ఫాలెరీ అనే అమీబా నీటి ద్వారా ప్రజలకు సోకుతుంది. అది ముక్కు రంధ్రాల ద్వారా మెదడుకు పాకి మెదడు కణజాలాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. దీంతో రోజుల వ్యవధిలోనే రోగి మరణిస్తారు.

నెవాడాలో రెండేళ్ల ఉడ్రో టర్నర్ బండి అనే బాలుడికి ‘నెగ్లేరియా ఫౌలెరి’ అనే ఇన్ ఫెక్షన్ సోకింది. నీటిలో ఆడుతున్నప్పుడు ఆ బాలుడి శరీరంలోకి ఈ ఇన్ఫెక్షన్ చొరబడిందని తెలుస్తోంది. మొదట ఫ్లూ లక్షణాలతో ఉన్న బాలుడిని తల్లి బ్రియానా ఆసుపత్రికి తీసుకు వెళ్లిందట. అక్కడ వైద్య సిబ్బంది అసలు ఈ వ్యాధి ఏంటి అనే విషయాన్ని గుర్తించలేకపోయారు. కానీ తరువాత అది ‘బ్రైన్ ఈటింగ్ అమీబా' అని గురించారు. ఉడ్రో టర్నర్ తల్లి బ్రియానా చిన్నారి మరణాన్నిఫేస్ బుక్ పోస్ట్‌లో షేర్ చేసుకుంది. ఈ వ్యాధితో 7 రోజులు పోరాడాడని, రికార్డులో అత్యధిక కాలం జీవించిన 3 వ వ్యక్తిగా తన కొడుకు ఉన్నాడని బ్రియానా పేర్కొన్నారు. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చిన తర్వాత సుమారు వారం రోజుల్లోనే రోగులు మరణిస్తారు. ఫిబ్రవరి 2023 లో US లో 50 ఏళ్ల వ్యక్తిని కూడా ఈ ఇన్ఫెక్షన్ ప్రాణాలు తీసింది.



ఇక ఈ వ్యాధి వివరాల్లోకి వెళితే అమీబా సరస్సులు, నదులలో కనిపించే ఏకకణ జీవి . ఈ అమీబా ఉన్న నీరు ముక్కులోనికి వెళ్లినపుడు ఇది మెదడుకు సోకుతుంది అందుకే దీనిని ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ అంటారు. ఇది అరుదైన వ్యాధి మాత్రమే కాదు ప్రాణాంతకం కూడా. కలుషిత నీరు మెదడుకి చేరాకా 12 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపించిన ఒకటి నుండి 18 రోజుల లోపు వ్యక్తులు మరణిస్తారు. . తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ గట్టిపడటం, మూర్ఛ, కోమా ఈ వ్యాధి వల్ల కలిగే కొన్ని లక్షణాలు. వ్యాధి తీవ్రమవుతున్న కొలది.. మానసిక సంతులనం కోల్పోవడం, భ్రమలకు గురవడం, చివరకు కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ ఇన్ఫెక్షన్ కు ఎలాంటి టీకా అందుబాటులో లేదు. ఈ వ్యాధికి ప్రస్తుతం వైద్యులు వివిధ యాంటి బయాటిక్స్ తో చికిత్స అందిస్తున్నారు.

దీన్ని మైక్రో స్కోప్ ద్వారా గుర్తించవచ్చు. నదులు, చెరువులు కాలువలు, హాట్ స్ప్రింగ్స్ వంటి మంచి నీటి సరస్సుల్లో, నిర్వహణ సరిగ్గా లేని స్విమింగ్ పూల్స్ లో ఇది విస్తరిస్తుంది. ఉప్పునీటిలో ఈ అమీబా జీవించలేదు. అందువల్ల సముద్రాల్లో అది కనిపించదు.

Tags

Next Story