South Korea: బ్యాటరీ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

South Korea: బ్యాటరీ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
X
22 మంది దుర్మరణం

దక్షిణ కొరియా లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లిథియం బ్యాటరీ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. రాజధాని సియోల్‌కు దక్షిణంగా హ్వాసోంగ్‌లో ఉన్న లిథియం బ్యాటరీ తయాకీ కేంద్రంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మంటలు చెలరేగినట్లు యోన్‌హాప్‌ వార్తా సంస్థ నివేదించింది. దాదాపు 35 వేల యూనిట్లు ఉన్న గిడ్డంగిలో బ్యాటరీ సెల్స్‌ వరుస పేలడంతో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారి కిమ్‌ జిన్‌-యంగ్‌ తెలిపినట్లు సంస్థ పేర్కొంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 20 మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపింది. తీవ్రంగా గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నివేదించింది.

Tags

Next Story