18 Jan 2021 3:21 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / బైడన్ ప్రభుత్వంలో 20...

బైడన్ ప్రభుత్వంలో 20 మంది ఇండియన్స్

20మంది ఇండియన్స్ ని ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఇప్పటికే నియమించారు బైడన్. ఇందులో 13 మంది మహిళలే ఉండటం విశేషం.

బైడన్ ప్రభుత్వంలో 20 మంది ఇండియన్స్
X

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ట్రంప్, మోదీ మధ్య బంధం కారణంగా ఇండియన్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదని భావించినా కూడా బైడన్ పటాపంచలు చేస్తూ భారత అమెరికన్లకు పట్టం కట్టారు. 1శాతం ఉన్న వర్గానికి పెద్దపీట వేస్తూ మొత్తం 20మందిని తన ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఇప్పటికే నియమించారు. ఇందులో 13 మంది మహిళలే ఉండటం విశేషం. జో బైడన్, కమలా హారిస్ సారధ్యంలోని ప్రభుత్వంలో మనవాళ్లు విధులు నిర్వర్తిస్తారు. 20 మందిలో 17 మంది వైట్ హౌస్ లోనే ఉంటారు. వీరే కాకుండా ఇంకా క్యూలో కొందరన్నారు.

ఇప్పటి వరకూ కీలక పదవుల్లో ఉన్నవాళ్లు...

1. నీరా టాండన్: వైట్ హౌస్ ఆఫీస్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.

2. డాక్టర్. వివేక్ మూర్తి: US సర్జన్ జనరల్

3. వనితా గుప్తా: అసోసియేట్ అటార్నీ జనరల్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్

4. ఊజ్ర జయ: ఫస్ట్ లేడీగా అడుగుపెడుతున్న జిల్ బైడెన్ కు పాలసీ డైరెక్టర్ గా నియామకం.

5. గరిమా వర్మ: ఫస్ట్ లేడీ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా వ్యవహరిస్తారు

6.సబ్రీనా సింగ్: ఫస్ట్ లేడీ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ

7. ఐషా షా: వైట్ హౌస్ ఆఫీస్ డిజిటల్ స్ట్రాటజీ పార్టనర్ షిప్ మేనేజర్

8. సమీరా ఫాజిలి: US నేషనల్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్

9.భారత్ రామమూర్తి: నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్

10. గౌతం రాఘవన్: ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్

11. వినయ్ రెడ్డి: స్పీచ్ రైటింగ్ డైరెక్టర్

12. వేదాంత్ పటేల్: అమెరికా అధ్యక్ష భవనంలో అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ

13. సోనియా అగర్వాల్: క్లేమేట్ పాలసీ సీనియర్ అడ్వైజర్

14. విదుర్ శర్మ: వైట్ హౌస్ కోవిడ్ రెస్పాన్స్ టీమ్

వీళ్లతో పాటు.. తరుణ్ చాబ్రా, సుమోనా గుహా, నేహా గుప్తా, రీమా షా వంటి వాళ్లు కూడా కీలక పోస్టుల్లో బాధ్యతలు తీసుకుంటారు.

Next Story