Earthquake: చైనాలో భారీ భూకంపం... 20మందికిపైగా గాయాలు

తూర్పు చైనాను(China) భారీ భూకంపం (Earthquake) వణికించింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన సంభవించిన భూకంపంతో 21 మందికిపైగా గాయపడ్డారు. 130కిపైగా ఇళ్లు నేలమట్టమయ్యాయని ప్రభుత్వ మీడియా చైనా సెంట్రల్ టీవీ ప్రకటించింది. రాజధాని బీజింగ్‌కు (Beijing) 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెజౌ (Dezhou) నగరంలో వేకువజామున 2.33 గంటలకు భూమి కంపించింది.
బీజింగ్‌కు (Beijing) 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెజౌ (Dezhou) నగరంలో వేకువజామున 2.33 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదయినట్లు చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొంది. భూకంప ప్రభావంతో కొన్ని రైలు కార్యకలాపాలను నిలిపివేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com