బస్టాప్ లో వేచి ఉన్న భారతీయ విద్యార్థిని.. బుల్లెట్ తగిలి ప్రాణాలు..

కెనడాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిక్కుకుని 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని మరణించింది. హామిల్టన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హర్సిమ్రత్ రంధావా బస్ స్టాప్‌లో వేచి ఉండగా, ప్రమాదవశాత్తు బుల్లెట్ ఆమెను తాకడంతో ప్రాాణాలు కోల్పోయింది.
ఒంటారియోలోని హామిల్టన్‌లోని మోహాక్ కళాశాల విద్యార్థిని అయిన రాంధావా ఆఫీసుకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. గత నాలుగు నెలల్లో కెనడాలో మరణించిన నాల్గవ భారతీయురాలు ఆమె. టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ మాట్లాడుతూ, రాంధ్వా అన్యాయంగా బుల్లెట్ కు బలైందని అన్నారు.
"భారతీయ విద్యార్థిని హర్సిమ్రత్ రంధావా విషాద మరణం పట్ల మేము చాలా బాధపడ్డాము... స్థానిక పోలీసుల ప్రకారం, ఆమె ఒక అమాయక బాధితురాలు, ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మేము ఆమె కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాము. అవసరమైన సహాయాన్ని వారికి అందిస్తున్నాము" అని ట్వీట్ చేసింది.
అప్పర్ జేమ్స్ మరియు సౌత్ బెండ్ రోడ్ వీధుల సమీపంలో కాల్పులు జరిగాయని హామిల్టన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. రాంధవా ఛాతీపై తుపాకీ గాయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, కానీ ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.
ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలో నల్లటి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తెల్లటి సెడాన్‌లో ఉన్న వారిపై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు కనిపించాయి. కాల్పులు జరిపిన తర్వాత వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కాల్పుల ఘటనలో పేలిన బుల్లెట్లు సమీపంలోని ఒక నివాస కిటికీని కూడా తాకాయని పోలీసులు తెలిపారు. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు.
గత 4 నెలల్లో కెనడాలో నలుగురు భారతీయుల హత్య
కెనడాలో వేర్వేరు సంఘటనలలో ముగ్గురు భారతీయులు మరణించిన నాలుగు నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దేశంలో పెరుగుతున్న ద్వేషపూరిత నేర హింసల నేపథ్యంలో భారతదేశం తన దేశీయులను అప్రమత్తంగా ఉండాలని కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com