Morocco: మొరాకోలో ఘోర ప్రమాదం... 24 మంది మృతి

Morocco: మొరాకోలో ఘోర ప్రమాదం... 24 మంది మృతి
X
ప్రమాదకర మలుపు వద్ద బోల్తా పడ్డ మినీ బస్సు... వ్యవసాయ కూలీలు దుర్మరణం...

మొరాకో(Morocco)లో ఘోర రోడ్డు ప్రమాదం( Minibus Accident) సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు బోల్తాపడి 24 మంది‍ మరణించారు(24 Killed‌) . సెంట్రల్ మొరాకో(central province ‌)లోని అజిలాల్ ప్రావిన్స్‌లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. డెమ్నాట్ పట్టణంలో వారాంతపు సంత( weekly market)కు వెళ్తున్న మినీ బస్సు ప్రమాదకర మలుపు వద్ద బోల్తా పడింది. రోడ్డు మలుపు వద్ద( overturned on a bend) వేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది వ్యవసాయ కూలీ(agricultural workers )లే ఉన్నారని అధికారులు తెలిపారు.


ప్రమాదం గురించిన సమాచారం అందగానే రాయల్ జెండర్మీర్ పౌర రక్షణ సంస్థ సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద స్థలానికి చేరుకొన్న దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ఇటీవలి కాలంలో మొరాకోలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏడాదికి రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించేవారు సంఖ్య సగటున 3500గా ఉందని, గతేడాది 3200 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతంలో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని సరిగ్గా గత ఏడాది ఆగస్టులో తూర్పు కాసాబ్లాంకాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకోగా ఆ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. 2015లో యువ అథ్లెట్లు ప్రయాణిస్తున్న ఒక బస్సును సెమీ ట్రైలర్ ట్రక్కు ఢీకొట్టడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయారు.


మొరాకోలో చాలామంది పేదలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించడానికి ఇలాంటి మినీ బస్సులను ఉపయోగిస్తారు. 2012లో మొరకోలో జరిగిన ఘోర ప్రమాదంలో 42 మంది మరణించారు.

Tags

Next Story