Boat Capsized: ఘోర పడవ ప్రమాదం.. 27 మంది మృతి

వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా హలోంగ్ బేలో పర్యాటకుల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది మరణించారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 53 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో, ‘స్టార్మ్ విఫా’ అనే తుఫాను దక్షిణ చైనా సముద్రం నుంచి వియత్నాం వైపు కదులుతున్నందున, సముద్రంలో బలమైన గాలులు, భారీ వర్షాలు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. పడవలో ఉన్న చాలా మంది ప్రజలు రాజధాని హనోయ్ కి చెందిన వారిగా గుర్తించారు.
వియత్నాం వార్తా సంస్థ ప్రకారం, సహాయ, రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు 11 మందిని సజీవంగా రక్షించగా, ఎనిమిది మంది పిల్లలు సహా 27 మృతదేహాలను వెలికితీశాయి. ప్రస్తుతం, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. హనోయ్ కి ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హలోంగ్ బే వియత్నాంలో ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. ఇక్కడ పడవ ప్రయాణాలు పర్యాటకులకు బాగా ప్రాచుర్యం పొందాయి.
ఈ సంవత్సరం దక్షిణ చైనా సముద్రాన్ని తాకిన మూడవ అతిపెద్ద తుఫాను టైఫూన్ విఫా ఇది వచ్చే వారం ప్రారంభంలో వియత్నాం ఉత్తర తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుఫాను కారణంగా విమాన సేవలు కూడా ప్రభావితమయ్యాయి. హనోయ్‌లోని నోయి బాయి విమానాశ్రయం తొమ్మిది విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించగా, మూడు విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com