Kuwait: 282 మంది ప్రవాసులు అరెస్ట్

గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉల్లంఘనదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న కువైట్ తాజాగా మరో 282 మందిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఖైతాన్, హవాలి, అల్ దజీస్, కబ్డ్, బ్రాయే సలేం, సల్హియా, మహబౌలా, ఫహాహీల్ మార్కెట్స్, ఫర్వానియా తదితర ప్రాంతాల్లో రెసిడెన్సీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన తనిఖీలో వీరు పట్టుబడ్డారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న ప్రవాసులను గుర్తించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగాయి. అరెస్ట్ అయిన వారందరూ రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్టు అధికారులు పేర్కొన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెసిడెన్సీ నిబంధనల సమగ్రతను కాపాడడం, కార్మిక చట్టాల నిబద్ధతను కాపాడేందుకు ఈ తనిఖీలు ఉపయోగపడతాయని వివరించారు.
రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల జనరల్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన కీలక విభాగాల ఈ తనిఖీలు అమలు చేయడం జరగుతోంది. వీటిలో పరిశోధన మరియు పరిశోధన విభాగం, నియంత్రణ మరియు సమన్వయ విభాగం, ఆర్థిక మరియు పరిపాలనా సేవల విభాగం, త్రిసభ్య కమిటీ ఉన్నాయి. ఈ సంయుక్త సోదాలు రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించి దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న ప్రవాసుల ను గుర్తించడమే లక్ష్యంగా కొనసాగాయి. ముఖ్యంగా రెండు నకిలీ గృహ కార్మిక కార్యాలయాలు, ఒక అక్రమ మసాజ్ ఇన్‌స్టిట్యూట్‌ను లక్ష్యంగా చేసుకుని సంబంధిత అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఇక అరెస్టైన 282 మంది ప్రవాసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. రెసిడెన్సీ నిబంధనల సమగ్రతను కాపాడుకోవడానికి, కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా నిబద్ధతను పాటించడానికి ఈ తనిఖీల ప్రచారకార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా రెసిడెన్స్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్ చెబుతోంది.
అయితే చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా అడ్డుకోవడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నప్పటికీ ప్రవాసీయుల సంఖ్యను తగ్గించుకోవడానికే కువైట్ ఈ చర్యలకు పాల్పడుతున్నదన్న విమర్శలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com