Dubai Fashion Show 2023 : దుబాయ్ లో ఫ్యాషన్ షో

ఇండియా సోషల్ సెంటర్ అబుదాబిలో ప్రవాసీ భారతీయుల ప్రముఖ సాంఘిక మరియు సంక్షేమ కేంద్రంగా గత 56 సంవత్సరాలుగా సేవలందిస్తోంది.. ఆ సంఘం మహిళా విభాగం IWF మహిళా సాధికారత సాధించే విషయంలో ముందంజలో ఉంది. ఏడాది చివరన IWF సంస్థ మహిళలే ప్రాధాన్యతగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.. 2022 - 23 ఏడాది గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయాన్ని చెందిన డీసీఎం సతీమణి జాహ్నవి అమర్నాథ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచిన Unity in Diversity Conceptతో చేసిన 29 రాష్ట్రాల ఫ్యాషన్ డ్రెస్ షో అందరినీ ఆకట్టుకుందని కార్యక్రమ నిర్వాహకులు షీలా మీనన్, పావని ఐత, ఐనీష్, అనూజ, శిల్ప, దీప తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని రెప్రజెంట్ చేసిన ఇద్దరు మహిళలు తెచ్చిన బోనం, బతుకమ్మలు విశేష ఆకర్షణగా నిలిచాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com