Malaysia: మలేషియాలో భారీ విస్ఫోటనం..

మలేషియాలో భారీ విస్ఫోటనం సంభవించింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివార్లలో రాష్ట్ర ఇంధన సంస్థ పుత్రా హైట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో గ్యాస్ పైప్‌లైన్ లోపల నుంచి మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 33 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని తెలిసింది.
అయితే పేలుడి ధాటికి సమీప ఇళ్లులు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. గోడలు పగిలిపోయాయి. ఇక రంగంలోకి దిగిన అధికారులు.. సమీప నివాసాలను ఖాళీ చేయించారు.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోవడం వల్లే ఈ విస్ఫోటనం జరిగిందని అగ్నిమాపక అధికారులు వివరించారు. జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారాన్ని అధికారులు వెల్లడించలేదు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సుమారు 500 మీటర్లు (1,600 అడుగులు) విస్తరించి ఉన్న గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా మంటలు కిలోమీటర్ల దూరంలో కనిపించాయి. మలేషియా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు సంస్థ పెట్రోనాస్‌కు చెందిన ప్రభావిత పైప్‌లైన్‌కు సంబంధించిన వాల్వ్‌ను ఆపివేసారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com