Earthquake: నేపాల్‌లో 6.4 తీవ్రతతో భూకంపం

Earthquake: నేపాల్‌లో 6.4 తీవ్రతతో భూకంపం
48 మంది మృతి.. భారత్‌లోనూ ప్రకంపనలు

నేపాల్ లో శుక్రవారం అర్దరాత్రి భారీ భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన భారీ భూకంపం వల్ల ఇప్పటికి 69 మంది మరణించారు. జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన బలమైన భూకంపం వల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. జాజర్‌కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప కొలత కేంద్రం అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత నేపాల్ హోం మంత్రిత్వ శాఖ మొట్టమొదటిగా 24 మృతదేహాలను వెలికితీసింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని అధికారులు చెప్పారు.

జాజర్‌కోట్ ప్రాంతంలో పదిమంది,రుకుమ్ జిల్లాలో 14 మంది మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీశారు. మృతుల్లో ఒకే ఇంటికి చెందిన ఒక మహిళ, చిన్నారి కూడా ఉన్నారు. దైలేఖ్, సల్యాన్,రోల్పా జిల్లాలతో సహా ఇతర జిల్లాల నుంచి కూడా క్షతగాత్రులు, ఆస్తి నష్టం నివేదికలు వస్తున్నాయని నేపాల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షతగాత్రులు జాజర్‌కోట్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జజార్కోక్ట్ ఖాట్మండుకు పశ్చిమాన 500 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూమిలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. అందువల్లే ప్రకంపనలు చాలా ఎక్కువగా ఉన్నాయి.


అక్టోబర్ 3వతేదీన 6.2 తీవ్రతతో సంభవించిన భూ ప్రకంపనలు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించాయి.భూ ప్రకంపనలు నేపాల్‌ను కుదిపేశాయి. ఒక సంవత్సరం క్రితం నవంబర్ నేపాల్ దేశంలోని దోటి జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి ఆరుగురు మరణించారు. దేశాన్ని కుదిపేసిన వరుస భూకంపాలలో ఇది ఒకటి. జాజర్‌కోట్, రుకుమ్ వెస్ట్‌తో పాటు పలు జిల్లాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన పట్ల నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించేలా ఆదేశాలు జారీ చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.



2015వ సంవత్సరంలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 12,000 మందికి పైగా మరణించారు. ఈ భూకంపం ధాటికి పర్వత దేశమైన నేపాల్ లో ఒక మిలియన్ భవనాలు దెబ్బతిన్నాయి. అర్దారాత్రి ప్రజలు ఇళ్లలో నిద్రలో ఉండగా భూకంపం సంభవించింది. భూకంపంతో ఇళ్లలోని ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.

Tags

Read MoreRead Less
Next Story