Kuala Lumpur airport: ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్..

మలేషియా లోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ సదుపాయంలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో సుమారు 39 మంది అస్వస్థతకు గురయ్యారు . అయితే, ప్రయాణికులు ఎవరూ తీవ్రంగా ప్రభావితం కాలేదని, విమాన ప్రయాణాలకు కూడా ఎలాంటి అంతరాయాలు కలగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది.సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ వద్ద గురువారం ఉదయం 11.23 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) కెమికల్ లీక్ గురించి అత్యవసర కాల్ వచ్చిందని, ప్రమాదకర మెటీరియల్స్ బృందంతో పాటు సిబ్బందిని పంపించామని సెలంగోర్ రాష్ట్ర అగ్నిమాపక విభాగం తెలిపింది. ప్యాసింజర్ టెర్మినల్‌కు ఇంజినీరింగ్ సౌకర్యంగా వేరుగా ఉందని పేర్కొంది. గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు. ఇక, విడుదలైన గ్యాస్‌ను మిథైల్ మెర్‌కాప్టాన్‌గా ఆగ్నిమాపక సిబ్బంది గుర్తించామన్నారు. విమాన రాకపోకల సమయాల్లో ఎటువంటి మార్పులు ఉండవని అధికారులు వెల్లడించారు. ప్రమాదకర మెటీరియల్స్ బృందంతో పాటు సిబ్బందిని పంపించామని సెలంగోర్ రాష్ట్ర అగ్నిమాపక విభాగం చెప్పుకొచ్చింది. ప్యాసింజర్ టెర్మినల్‌కు ఇంజినీరింగ్ సౌకర్యం వేరుగా ఉందని తెలిపింది. గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com