US FIRE: అమెరికాలో కాల్పులు... నలుగురి మృతి

అమెరికాలో విచ్చలవిడి తుపాకుల సంస్కృతి మరో సామూహిక కాల్పుల ఘటనకు దారితీసింది. ఆయుధాలు ధరించి ఒక దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. జార్జియాలోని (Georgia) హెన్రీ కౌంటిలో (Henry county) ఉన్న హాంప్టన్ ప్రాంతంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. మరణించిన వారిలో ముగ్గురు పరుషులు, ఓ మహిళ ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని హాంప్టన్ పోలీస్ చీఫ్ జేమ్స్ టర్నర్ (James Turner) వెల్లడించారు.
US FIRE: అమెరికాలో కాల్పులు... నలుగురి మృతిహాంప్టన్(Hampton)కు చెందిన 40 ఏళ్ల వయస్సున్న ఆండ్రీ లాంగ్‌మోర్ (Andre Longmore) అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అతడి గురించి సమాచారం అందించినవారికి 10 వేల డాలర్లు రివార్డు ప్రకటించారు. నలుపు రంగులో ఉన్న జీఎంసీ అకాడియా ఎస్‌యూవీ (GMC Acadia SUV)లో అతడు తప్పించుకుని ఉండొచ్చని చెప్పారు. అతని ఫొటోను అధికారులు విడుదల చేశారు. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 31 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో 153 మంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com